Sudigali Sudheer : మళ్లీ ఆ పనికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. భయపడుతోన్న ఫ్యాన్స్..

- Advertisement -

Sudigali Sudheer : బుల్లితెర పై స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్.. హీరోగా మారి సినిమాలు చేస్తూ వస్తున్నారు. దీంతో బుల్లితెరకు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసారు. అయితే బుల్లితెర అభిమానులంతా.. సుధీర్ ని మిస్ అవుతూ వస్తున్నారు. సుధీర్ మళ్ళీ ఎప్పుడు బుల్లితెర పై కనిపిస్తారో అని ఎదురు చూస్తున్నారు.

ఆ ఎదురు చూపులకు ఎండ్ కార్డు వేస్తూ బుల్లితెర రీ ఎంట్రీకి సుధీర్ సిద్ధమయ్యారు. అయితే ఈ రీ ఎంట్రీ టెలివిజన్ లో కాదు ఓటీటీలో ఉండబోతుంది. ఆహాలో ప్రసారమయ్యే ‘సర్కార్ గేమ్ షో’కి సుధీర్ హోస్టుగా చేస్తూ తన రీ ఎంట్రీని డిజైన్ చేసారు. ఈ సక్సెస్‌ఫుల్ గేమ్ షో నుంచి ఇప్పటికే మూడు సీజన్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు నాలుగో సీజన్ త్వరలో టెలికాస్ట్ కి సిద్దమవుతుంది.

- Advertisement -

సుడిగాలి సుధీర్

గతంలో ఈ షోకి ప్రదీప్ హోస్టుగా చేసారు. అయితే ప్రస్తుతం ప్రదీప్.. బుల్లితెరకు బ్రేక్ ఇచ్చేసారు. కారణం ఏంటనేది తెలియదు గాని, టీవీ అండ్ ఓటీటీలో తాను చేసే షోలు అన్నిటినుంచి ప్రదీప్ తప్పుకున్నారు. ప్రదీప్ కూడా తప్పుకోవడంతో.. బుల్లితెరకి మేల్ హోస్ట్‌లు కొరత ఏర్పడింది. దీంతో చేసేది లేక ఆహా టీం.. ‘సర్కార్ గేమ్ షో’ కోసం సుధీర్ ని మళ్ళీ తీసుకు వస్తున్నారు. మరి ఇన్ని రోజులు సినిమాల్లో బిజీగా ఉన్న సుధీర్.. ఇప్పుడు రీ ఎంట్రీలో ఎలా అలరించబోతున్నారో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here