అల్లు అర్జున్ తో సినిమా అంటే వద్దు బాబోయ్ అంటున్న హీరోయిన్స్

- Advertisement -

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పేరు దేశమంతా మారు మోగిపోతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటుల అవార్డుల లిస్టులో ఉత్తమ జాతీయ నటుడిగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. ఈ సమయంలోనే అల్లు అర్జున్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన డ్యాన్స్, నటనతో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది. జాతీయ అవార్డు రావడంతో గ్లోబల్ స్థాయిలో ఆయనకు మరికొంత మంది ఫ్యాన్స్ అయిపోయారు. అంతటి స్థాయిని అందుకున్న బన్నీతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఆయనతో సినిమాలో నటించేందుకు ససేమీరా అంటుందట. ప్రస్తుతం ఇదే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అల్లు అర్జున్
అల్లు అర్జున్

ప్రస్తుతం బన్నీ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2. ఈ సినిమా కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తోంది. ఇప్పటికే దాదాపు 80శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది సినిమా. ఈ సినిమా రెండు పాటలు కొన్ని సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఇప్పటికే సుకుమార్-బన్నీ ముగ్గురు హీరోయిన్లతో చేయించాలని అనుకున్నారట. కాకపోతే ఆ ముగ్గురు కూడా ఆ బంపర్ ఆఫర్ తిరస్కరించారట. ఏంటి స్టార్ హీరోతో ఛాన్స్ వస్తే ఆ హీరోయిన్స్ ఎందుకు మిస్ చేసుకున్నారని అంతా తలలు పట్టుకుని ఆలోచిస్తున్నారు. ఆ హీరోయిన్స్ ఛాన్స్ ఎందుకు వదులుకున్నరంటే సుకుమార్ వారికి చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తుంటారని టాక్. సాధారణంగా పాన్ ఇండియా సినిమా అంటే ఐటమ్ సాంగ్ చేస్తే మూడు నాలుగు కోట్ల రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ సుకుమార్ కోటి రూపాయలకు మించి ఇవ్వనని చెప్పుతున్నారట. అందుకే సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు బన్నీ స్పీడ్ కి మేం తట్టుకోలేమని హీరోయిన్స్ ఆయనతో డ్యాన్స్ చేయడానికి కూడా భయపడిపోతున్నారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here