Pawan Kalyan : ఎక్కడికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ను వెంటాడుతున్న స్టార్ హీరోయిన్స్

- Advertisement -

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల దాకా పవన్ పేరు వింటే చాలు ప్రేమలో పడిపోతారు. పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది అభిమానులున్నారు. స్టార్ హీరోయిన్లు సైతం సారుకు ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. ఆయనను నిత్యం అనుసరిస్తూనే ఉంటారు.

Pawan Kalyan
Pawan Kalyan

మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోయిన్లు ఆయన జీవనశైలిని ప్రతినిత్యం గమనిస్తూనే ఉంటారు. అసలు మ్యాటర్లోకి వెళితే.. సినిమాల ద్వారా భారీ క్రేజ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్విట్టర్ ను ఫాలో అవుతారు.. కానీ ఈయన తాజాగా జూలై 4న ఎలుగెత్తు ఎదిరించు ఎన్నుకో – జైహింద్ అనే ఒక బయోతో తన ఇన్ స్టా అకౌంట్ ఓపెన్ చేశారు.

ఇలా అకౌంట్ ఓపెన్ చేశారో లేదో ఇలా ఫాలోవర్లు పోటెత్తారు. దెబ్బకు ఇన్ స్టా యాప్ ఒక్క సారిగా షేక్ అయింది. ఇకపోతే నేటి మధ్యాహ్నం వరకు ఆయన ఫాలోవర్స్ లిస్టు చూస్తే ఏకంగా 2.3 మిలియన్లకు చేరుకుంది. అందులోను ఒక పోస్ట్ కూడా పెట్టకుండానే ఈ రేంజ్ లో ఫాలోవర్స్ వచ్చారు.. అంటే ఆయన పోస్టులు పెడితే మరెంత మంది ఫాలోవర్స్ వస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఇన్ స్టాలో మొదటి పోస్ట్ ఏంటో అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఫాలోవర్స్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆయనను ఇండస్ట్రీకి చెందిన కొందరు సెలబ్రిటీలు ఇన్ స్టాలో ఫాలో అవుతున్నారు. తాజాగా శృతిహాసన్, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్లు ఇన్ స్టాగ్రామ్ లో ఆయనను ఫాలో అవుతున్నారు. దీంతో వీరిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానులు అన్న విషయం తెలుస్తోంది.

shruti haasan
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here