Salmankhan : స్టేజ్ మీదే ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన సల్మాన్ ఖాన్.. ఛీ.. ఛీ..

- Advertisement -

Salmankhan బాలివుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. సినిమాలతో పాటు వివాదాలను కూడా కోరి తెచ్చుకుంటాడు.. ఈయన బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తూ వస్తున్నాడు.. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ప్రజల్లో మంచి ఆదరణ పొందింది.. ఇక సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో బిగ్ బాస్ షోకు పర్మినెంట్ హోస్ట్ అన్న సంగతి తెలిసిందే.. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ మొదలైంది.. మొన్న ముద్దుల టాస్క్ జనాలకు కోపం తెప్పిస్తే.. ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ స్టేజ్ పైనే సిగరెట్ తాగుతూ కనిపించాడు.. ఇందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Salmankhan
Salmankhan

ఈ శనివారం (జులై 8) కంటెస్టెంట్స్ ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్.. హౌస్ లో ఉన్నవారి తప్పొప్పులను చూపించి కౌంటర్స్ ఇచ్చాడు. అయితే ఇదే సమయంలో సల్మాన్ చేతిలో సిగరెట్‌తో కనిపించాడు. మర్చిపోయి అలా వచ్చేశాడా.. లేకు కావాలని ఇలాచేశాడా తెలియదు కాని.. రియాల్టీ షోలో ఆయన సిగరెట్ తో ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఒక సెలబ్రిటీ స్టేజిలో ఉన్న వ్యక్తే ఇలా పబ్లిక్ గా సిగరెట్‌ కాల్చి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారు అంటూ మరికొంతమంది మండిపడుతున్నారు.. మొత్తానికి దీనిపై పెద్ద చర్చే జరుగుతుంది.. మరి సల్మాన్, షో నిర్వాహకులు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి..

ఇప్పటికే సల్మాన్ చేసిన పనికి.. ఉగ్రవాదుల ముప్పుతో ఇబ్బందిపడుతున్నాడు. సల్మాన్ ను ఎలాగైనా చంపేస్తాం అని లారెన్స్ బిష్గోయ్ గ్యాంగ్ పంతం పూని తిరుగుతున్నారు. దాంతో సల్మాన్ ప్రస్తుతం వై క్యాటగిరీ భద్రత నడుమ తిరుగుతున్నాడు. తనకు తాను ప్రైవేట్ గా ఇంకాస్త సెక్యూరిటీని కూడా ఆడ్ చేసుకున్నాడు. ఇలా తాను చేసిన పనులకు ఇబ్బందిపడుతూనే ఉన్నాడు.. ఇప్పుడు ఇలాంటివి చేసి అడ్డంగా బుక్కవ్వడం పై జనాలు మండిపడుతున్నారు… ప్రస్తుతం వరుస సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here