Ram Charan : మెగా స్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, నేడు తండ్రినే మించిన తనయుడిగా ప్రపంచవ్యాప్తంగా తన పేరు ప్రఖ్యాతలు విస్తరింపచేసుకొని, పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా అంటే కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, ప్రపంచం లో ఉన్న మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు.
#RRR చిత్రం తర్వాత ఆయన శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2 వ తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడట నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చి బాబు తో రంగస్థలం లాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ గురించి ఎవరికీ తెలియని ఒక షాకింగ్ నిజం బయటపడింది.
అదేమిటంటే రామ్ చరణ్ కి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు కేవలం #RRR చిత్రం తో రాలేదు. మగధీర సినిమాతోనే ఆయన పేరు దేశమంతటా మారు మోగింది. ఈ సినిమా ద్వారా వచ్చిన ఫేమ్ తో ఆయన బాలీవుడ్ లో జంజీర్ అనే చిత్రం చేసాడు. పాత అమితాబ్ బచ్చన్ ‘జంజీర్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు లో ‘తుఫాన్’ పేరిట డబ్ అయ్యింది. ఇటు తెలుగులో, అటు తమిళం లో ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటించింది. అయితే ఆమె కంటే ముందుగా మూవీ టీం దీపికా పదుకొనే ని సంప్రదించారట. కానీ ఆమె అప్పట్లో చాలా పొగరుగా సౌత్ హీరోలతో వంద కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినా సినిమా చెయ్యను అని ఖరాకండిగా చెప్పేసిందట. ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ బాగా డౌన్ అవ్వడం తో, త్వరలోనే దీపికా పదుకొనే టాలీవుడ్ హీరోలపై ఆధార పడాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ తో ‘కల్కి’ చిత్రం చేస్తుంది.