భగవంత్ కేసరి.. ‘ముసలోడి స్టోరి’.. అంటూ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో

- Advertisement -

సినిమాలకు సంబంధించిన చాలా కథలు హీరోల చేతులు మారుతుండడం సహజం. కొన్నిసార్లు కాల్ షీట్స్ అడ్జస్ట్ కాక.. మరి కొన్ని సార్లు కథలు నచ్చక ఒక హీరో కోసం రాసుకున్న కథ మరో హీరో చేస్తుంటారు. కారణం ఏదైనా ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లి సూపర్ డూపర్ హిట్ అయితే ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది. అయితే ఇలాంటి బాధలు మన ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అనుభవించే ఉన్నారు. కానీ తెలిసి తెలిసి ఓ మంచి సినిమా స్టోరీని ఛీప్ రీజన్తో రిజెక్ట్ చేస్తే ఆ బాధ వర్ణణాతీతం. ప్రజెంట్ అలాంటి బాధనే అనుభవిస్తున్నారు ఓ స్టార్ హీరో.

భగవంత్ కేసరి
భగవంత్ కేసరి

సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. టైం బాలేక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో ఫెడవుట్ హీరోగా పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన అదృష్టమో ఏమో కానీ డైరెక్టర్లు మాత్రం ఆయనకి ఇంకా సినిమా అవకాశాలు ఇవ్వడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. అలాంటి హీరో దగ్గరకి వెళ్లి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‎గా పేరుపొందిన అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమా స్టోరీ చెప్పారట. కథ చాలా ఓల్డ్ గా ఉందని.. మాస్ ఎలివేషన్స్ ఎక్కువగా ఉండడంతో .. ఆ హీరోకి నచ్చలేదని చెప్పాడట.. అంతేకాకుండా ఈ సినిమాని ముసలోడి స్టోరీ అంటూ రిజెక్ట్ చేశాడట. దీంతో ఆ హీరో అన్న మాటకు అనిల్ రావిపూడి హర్ట్ అయ్యారట.

Anil Ravipudi

ఎంతో నమ్మకంతో యాక్సెప్ట్ చేస్తారని ఆ హీరో ఇంటికి వెళ్తే ఇలాంటి కామెంట్స్ చేయడంతో తెగ బాధపడ్డారట. ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ వద్ద చెప్పుకుని బాధపడ్డారట. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ ఈ స్టోరీని బాలయ్యకు బాగా సూట్ అవుతుందని సలహా ఇచ్చారట. దాంతో బాలయ్యకు ఆ స్టోరీ వివరించారట అనిల్ రావిపూడి. కథ వినగానే బాగా నచ్చి స్పాట్లోనే అగ్రిమెంట్ పేపర్లపై సంతకం కూడా చేశారట బాలయ్య. దీంతో అలా సినిమా పట్టాలెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది. సినిమా రిలీజై సూపర్ డూపర్ హిట్ కొట్టడంలో సందేహం లేదని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం ఆ హీరో సినిమా అప్ డేట్లను చూసి తెగ బాధపడుతున్నాడట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here