శ్రీలీల.. ఇప్పుడు టాలీవుడ్లో బాగా వినిపిస్తున్న పేరు. ఈ బ్యూటీ తెలుగులో చేసింది ఒక సినిమాయే అయినా వరుస ఆఫర్లు తలుపుతడుతున్నాయి. మొదటి మూవీ కూడా అంతగా హిట్ కాకపోయినా Sreeleela చేతిలో ఇప్పుడు నాలుగైదు మూవీస్ ఉన్నాయి. ఓవైపు బాలకృష్ణ లాంటి అగ్రహీరో.. మరోవైపు రవితేజ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఉన్న హీరో.. ఇంకోవైపు రామ్ లాంటి యంగ్ హీరోలతో ఆడిపాడే అవకాశాలు దక్కించుకుంటోంది.
శ్రీలీల.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందDతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందించిన ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో శ్రీలీల ఇందులో రొమాన్స్ చేసింది.
ఈ సినిమాను పోయినేడాది 2021 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. గతంలో పెళ్లి సందడి సంగీతం అందించిన కీరవాణి, గీతా రచయిత చంద్రబోస్ ఈ సినిమాకు కూడా పని చేయడం విశేషం. తండ్రి శ్రీకాంత్ నటించిన టైటిల్‌తో తనయుడు రోషన్ హీరోగా నటించడం మరో విశేషం. ఈ చిత్రంలో రాఘవేంద్రరావు కూడా కీలక పాత్రలో కనిపించి అదరగొట్టారు.
ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన శ్రీలీలకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. కుర్ర హీరోలు ఆమెనే హీరోయిన్గా రికమెండ్ చేస్తున్నారట. పెళ్లి సందD సినిమాలో నటించినందుకు శ్రీలీలకు మంచి పేరొచ్చింది. ఆ మూవీలో ఈ భామ బాగానే అందాలు ఆరబోసింది. చూడ్డానికి ముద్దుగా బొద్దుగా అందంగా కనిపించడంతో పాటు తన నటన, డ్యాన్సులతో అదరగొట్టింది. మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ఈ బ్యూటీ టాలెంట్ చూసిన డైరెక్టర్లు మాత్రం వరుస ఆఫర్లు ఇచ్చేస్తున్నారు.
పెళ్లిసందD తర్వాత శ్రీలీలకు మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’లో ఆఫర్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే బాలకృష్ణ-అనిల్ రావిపూడి మూవీలో అవకాశం వచ్చింది. బాలయ్య బాబు సినిమా గురించి చర్చలు జరుగుతండగానే రామ్-బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇలా వరుస ఆఫర్లతో శ్రీలీల బిజీబిజీగా గడుపుతోంది.
సోషల్ మీడియాలో శ్రీలీలకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్‌గా మారింది. చేతినిండా సినిమాలు ఉన్న ఈ బ్యూటీకి మరో స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చాడట. కానీ కాల్షీట్లు అడ్జెస్ట్ చేయలేక అంతకు ముందు ఓకే చేసిన మరో స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటోదట. ఈ విషయాన్ని శ్రీలీల డైరెక్టర్‌కు కూడా చెప్పిందట. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటున్నాననని చెప్పుకొచ్చిందట.
ఈ విషయం తెలుసుకున్న హీరో డైరెక్ట్‌గా శ్రీలీలకు ఫోన్ చేశాడట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే తనలాంటి స్టార్ హీరో సినిమా రిజెక్ట్ చేయడమేంటని వార్నింగ్ కూడా ఇచ్చాడట. ‘ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నది మామూలు విషయం కాదు. దీనికోసం ఎంతగానో శ్రమించాలి. వచ్చిన మంచి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకుంటే… ఓ పదో పన్నెండో సినిమాలు చూసి… కెరీర్ ముగించాల్సి ఉంటుంది.’ అని స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.