బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ మీదుంది శ్రుతి హాసన్. ఈ ఏడాది నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాల్లో ఇదే భారీ బడ్జెట్ పాన్ చిత్రం కావడం విశేషం.యంగ్ హీరోల సరసన సినిమాలు చేయాల్సిన టైమ్‌లో 60 ప్లస్ హీరోల సినిమాలకు ఎందుకు స్టెప్పులేస్తున్నట్టు..? అని పెద్ద చర్చే నడిచింది. అయితే, ఇలాంటి విషయాలను పట్టించుకోనని ఆ మధ్య చెప్పేశారు శ్రుతిహాసన్ అయితే వెండితెరపైనే కాకుండా.. నిజజీవితంలో శ్రుతి హాసన్ కాస్త విభిన్నం.

గతంలో శృతి హాసన్ లండన్ కి చెందిన మైకేల్ కోర్స్లేతో ఎఫైర్ నడిపారు. వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. మరి శాంతనుతో అయినా ఆమె బంధం పెళ్లి వరకు వెళుతుందా? అనే సందేహాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. శృతి హాసన్ ప్రస్తుతం లండన్ లో ఉంది. ఆమెతో పాటు ప్రియుడు శాంతను హజారిక కూడా వెళ్లారు. వీరి లండన్ ట్రిప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి నిత్యం శ్రమిస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రోజూ రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. నిత్యం రకరకాల ఫోటోలు’, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా శ్రుతి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.