‘మోసగాళ్లకు మోసగాడు’ రీ రిలీజ్ కి బంపర్ ఓపెనింగ్స్..మొదటి రోజు ఎంత వసూళ్లు వచ్చాయంటే!

- Advertisement -

తెలుగు చలన చిత్ర పరిశ్రమకి మొట్టమొదటి కౌ బాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. అప్పటి వరకు కేవలం హాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఈ జానర్ ని తెలుగు ఆడియన్స్ కి కూడా రుచి చూపించాడు మన సూపర్ కృష్ణ. ఆయన యవ్వనం లో ఉన్న రోజుల్లో,అనగా 50 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది.

మోసగాళ్లకు మోసగాడు
మోసగాళ్లకు మోసగాడు

అప్పటి వరకు ఎన్టీఆర్ పౌరాణికాలు మరియు ఏఎన్నార్ సాంఘిక చిత్రాలకు మాత్రమే మన తెలుగు ఆడియన్స్ అలవాటు పడి ఉన్నారు. ఇలాంటి కౌ బాయ్ తరహా చిత్రాలు వాళ్లకి చాలా కొత్త. ఇలాంటి సినిమాలు హాలీవుడ్ మూవీస్ కొన్ని ఇక్కడ ఆడడం వల్ల సిటీస్ లో ఉన్న ఆడియన్స్ కి కామన్ అయ్యినప్పటికీ , బి సి సెంటర్స్ ఆడియన్స్ కి మాత్రం ఇది కొత్త చిత్రమే.

.అయితే సూపర్ స్టార్ కృష్ణ కి ఉన్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణం చేత ఈ చిత్రం మాస్ ఆడియన్స్ కి కూడా దగ్గరైంది. అప్పట్లోనే 4 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అలాంటి బ్లాక్ బస్టర్ ని నిన్న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా 4K మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ తో విడుదలైంది. రెస్పాన్స్ అదిరిపోయింది, దానికి తోడు మహేష్ కొత్త చిత్రం ‘గుంటూరు కారం‘ టీజర్ ని కూడా సినిమాతో అటాచ్ చేస్తున్నామని చెప్పడం తో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ప్రోత్సహించారు.

- Advertisement -

ఫలితంగా ఈ చిత్రానికి హైదరాబాద్ , వైజాగ్ మరియు విజయవాడ వంటి ప్రాంతాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ పడ్డాయి. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి అన్నీ ప్రాంతాలకు కలిపి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మొదటి రోజు వచ్చాయట.50 ఏళ్ళ క్రితం విడుదలైన ఒక సినిమాని రీ రిలీజ్ చేస్తే ఇంత రెస్పాన్స్ వస్తుందా అని ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here