Khushi Kapoor : ‘బేబీ’ సినిమా టాలీవుడ్‌లో కల్ట్ లవ్ స్టోరీగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బోల్డ్ కంటెంట్ తో ట్రెండీ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ తరం యువతకు బేబీ సినిమా కనెక్ట్ అయ్యేలా సినిమా కావడంతో ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీని హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నట్టు ఇటీవల నిర్మాత ఎస్కేఎన్ వివరించారు.

ఈ సినిమా షూటింగ్ కూడా అక్కడే జరుగుతోందని మాతృక దర్శకుడు సాయి రాజేష్ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ గా కల్ట్ బొమ్మ అని టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఈ టైటిల్ ను ఇప్పటికే ఛాంబర్ లో రిజిస్టర్ చేశామని వివరించారు. హిందీలో స్టార్ పిల్లలతోనో.. కొత్తవాళ్లతోనో.. బేబీ రీమేక్ చేయాలనుకుంటున్నట్లు.. ఇక్కడి కంటే హిందీలో అర్జున్ రెడ్డి భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. బాలీవుడ్‌లో కూడా బేబీ ఆ రేంజ్ కలెక్షన్స్ తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నట్లు నిర్మాత భావిస్తున్నారు.

బాలీవుడ్ రీమేక్ లో నటీనటులుగా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.. అందులో శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. టీమ్ ఆమెను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా స్టార్ హీరో కొడుకుని హీరోగా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే స్టార్ పిల్లలతో వెళ్లాలా.. లేక ప్రముఖ యూట్యూబ్ స్టార్లతో వెళ్లాలా.. లేక స్టార్ హీరోలతో వెళ్లాలా అని ఆలోచిస్తున్నట్లు వివరించాడు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని అన్నారు. అయితే ఖుషీ కపూర్ పేరు బలంగా వినిపిస్తోంది.