Sri Simha Koduri టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గురించి తెలియని వారుండరు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సోదరుడిగానూ ఈయనకు గుర్తింపు ఉంది. అయితే ఈ ఫ్యామిలీలో దాదాపు అందరూ సినిమా బిజినెస్ లోనే ఉన్నారు. కీరవాణి ఇద్దరు కుమారులు.. కాళభైరవ సింగర్ కమ్ మ్యూజిక్ కంపోజర్ గా రాణిస్తుంటే.. చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా నటిస్తున్నాడు. శ్రీసింహా కూడా తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ టాలీవుడ్ యంగ్ హీరోలలో డిఫరెంట్ స్క్రిప్ట్స్ సెలక్ట్ చేస్తూ ముందుకెళ్తున్నాడు.

అయితే కెరీర్ లో ఇంతగా ఎదిగిన కొడుకుని చూస్తే ఏ తండ్రికైనా గర్వంగా ఉంటుంది. కానీ శ్రీసింహాకు.. కీరవాణికి మధ్య కనీసం మాటలే లేవంట. ఇంతకీ వీళ్ల మధ్య ఏం జరిగింది.. తెలుసుకోవాలంటే శ్రీసింహా గెస్టుగా వచ్చిన .. రీతూ చౌదరీ హోస్ట్ చేస్తున్న ‘దావత్’ ప్రోగ్రామ్ చూడాల్సిందే. ఈ ప్రోగ్రామ్ లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ షోలో శ్రీసింహా నుంచి రీతు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రాబట్టింది. మరి అవేంటో చూసేద్దామా..?
అయితే సాధారణంగా రాజమౌళి ప్రతి సినిమాకు కీరవాణియే సంగీతం అందిస్తాడన్న విషయం తెలిసిందే. అయితే శ్రీసింహా చిత్రాలకు కీరవాణి ఎందుకు మ్యూజిక్ ఇవ్వడం లేదు.. సోషల్ మీడియాలోనూ మీ తండ్రితో మీరు దిగిన ఒక్క ఫొటో లేదు.. కీరవాణి, మీరు మాట్లాడుకోరని బయట టాక్.. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలున్నాయా.. ఇలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడిగింది రీతూ శ్రీసింహాను. మరి సింహా వీటికి సమాధానాలు ఇచ్చాడా లేదా తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే.

అంతే కాదండోయ్ ఒకవేళ ఏదైనా సినిమాలో స్క్రిప్టు డిమాండ్ చేసి లిప్ లాక్ సీన్ ఉంటే.. తాను ఆ సీన్ లో నటించాల్సి వస్తే.. ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుందని రీతూ సింహాను అడిగింది. దానికి.. నాకేం చెప్పాలో అర్థం కావడం లేదంటూ సింహా సిగ్గుపడ్డాడు. అలాగే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ.. టీవీలో ఓ క్యారెక్టర్ నీళ్లు అడిగిందని నిజంగానే నీళ్లు తీసుకెళ్లి టీవీకి ఉన్న హోల్స్‌లో పోసేవాడిని అని చెప్పి అందరినీ నవ్వించాడు. ఇంకా ఈ ప్రోమోలో బోల్డెన్నీ ఫన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయో.. అందుకే మీరూ ఓసారి ఈ వీడియో చూసేయండి.