Sri Reddy లైఫ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు వివాదాస్పద నటిగా ఫెమస్ అయ్యింది.. కొంతమంది ఈ అమ్మడును సపోర్ట్ చేసిన కూడా మరికొంతమంది ఈమెను తిట్టిపొస్తున్నారు.. ఈమె నటిగా కంటే వ్యక్తిగత విషయంలో ఎక్కువగా తన పరిచయాన్ని పెంచుకుందినిత్యం ఏదో ఒక విషయంతో రచ్చ చేసే ఈ హాట్ బ్యూటీ గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూర్చింది.

ఇక సినిమాలలో అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ బాగా రచ్చరచ్చ చేస్తుంది.. రోజుకో వీడియో పెడుతూ కుర్రకారు మతి పోగొడుతుంది.. తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. కొంతమందిని బూతు మాటలతో షాక్ అయ్యేలా చేస్తుంది. అలా నిత్యం ఏదో ఒక పోస్టును వైరల్ గా మారుస్తుంది. ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పంపిస్తూ నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది. ఇక కొంతమంది రాజకీయ నాయకులను కూడా బాగా టార్గెట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను అస్సలు వదలదు ఈ బ్యూటీ. పలురకాల ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది. అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి. వెండి తెరపై మెరవకున్న సోషల్ మీడియా ద్వారా ప్రతి రోజు ఏదో ఒక విషయం తో మెరుస్తూనే ఉంటుంది..

ఈ మధ్య తన రూటును మార్చుకుంది.. యూట్యూబ్లో షార్ట్ వీడియోలతో మంచి మంచి కొటేషన్స్ చెబుతూ ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తుంది. అంతేకాకుండా అప్పటిలాగా పొట్టి పొట్టి బట్టలు వేసుకోకుండా పద్ధతిగా డ్రెస్సులు, చీరలు కట్టుకొని చాలా అందంగా కనిపిస్తుంది.ఆడవాళ్లకు చెప్పాల్సిన విషయాలు కూడా ఎన్నో పంచుకుంది. మంచి మంచి సూక్తులు వివరిస్తూ వస్తుంది. ఈ మధ్య తనలో బాగా భక్తి కూడా పెరిగిపోయింది.
గుళ్ళు గోపురాలు అంటూ దేవాలయాల చుట్టూ తిరిగి మరింత పుణ్యం సంపాదించుకుంటుంది.. తాజాగా యూట్యూబ్లో మరో షార్ట్ వీడియో వదిలింది. అందులో తమ పొలంలో వేరుశెనగలు వచ్చాయంటూ ఒక చేత్తో పట్టుకొని చూపించగా.. మరో చేతిలో పెద్ద పండుని చూపిస్తూ పెద్దగా ఉంది అంటూ ముద్దు పెట్టుకుంటూ కనిపించింది. ఇక అవి తమ పొలంలో పెరగటంతో శ్రీరెడ్డి చాలా సంతోషంగా కనిపించింది. ఎవరికైనా తమ పొలంలో ఇలా పెరుగుతాయంటే ఎంతో ఆనందంగా ఉంటుంది.. తన పొలంలో పెరిగాయని రైతులు ఇవ్వడం నాకు పట్టరాని ఆనందంలో మునిగి తెలుతుంది.. మొత్తానికి ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..