శ్రీరెడ్డికి కూడా టైం వచ్చిందిగా.. మరోసారి వార్తల్లోకి వచ్చిన ఫైర్ లేడి

- Advertisement -

తేజ దర్శకత్వంలో, దగ్గుబాటి అభిరామ్ హీరోగా, గీతికా తివారి హీరోయిన్ గా రూపొందిన అహింస చిత్రం జూన్ రెండవ తేదీ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. దగ్గుబాటి వారసుడి తొలి సినిమా కావడం.. పైగా తేజా లాంటి మంచి దర్శకుడు చేతిలో ఈ సినిమా రూపొందడం.. కొత్త నటుల్ని సినిమా రంగానికి ప్రేమకథా చిత్రాల ద్వారా అందించే సూపర్ డూపర్ హిట్స్ కొట్టే తేజా లాంటివాడు చేతితో ఈ సినిమా జరగడం.. వీటన్నిటిపై ఆడియన్స్ బాగానే అంచనాలను పెంచుకున్నారు. కానీ సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ ను మూటకట్టుకుంది.

శ్రీరెడ్డి
శ్రీరెడ్డి

దీంతో దర్శకుడు తేజాని.. తన మాజీ ప్రియుడు దగ్గుబాటి అభిరామ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి.‘అహింస’ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో తన నోటికి పనిచెప్తూ బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఆమె తిట్టినట్టుగా రాయలేం కానీ ‘మా అభి బావ హింస పెట్టాడటగా తేజాగా నీ పని అయిపోయింది కానీ కొత్త మొగ్గ లాగ ఫోజులు కొట్టకు. ఇంటికెళ్లు ఇక. హమ్మయ్యా అభి గాడు **పోయాడు. అయ్యో ఫాఫమ్’ అని ఫేస్ బుక్‌లో తెగ సంతోషపడిపోతూ పోస్ట్ పెట్టింది. ​అంతకు ముందు లైవ్‌లోకి వచ్చి దర్శకుడు తేజాకి హీరో అభిరామ్‌కి శాపనార్ధాలు పెడుతూ బూతులతో మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో తన పేరు వాడుకోవడంపై మండి పండింది శ్రీరెడ్డి.

‘నా ఎక్స్ లవర్.. దరిద్రపు నా *** నా పేరు చెప్పుకుని ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఆ డైరెక్టర్ కంటూ పెద్ద పేరు ఉండి చచ్చింది కదా మీ బ్రాండ్ చెప్పుకుని ప్రమోషన్స్ చేసుకుని చావొచ్చు కదా ఏ మీ సినిమాకి నన్ను వాడుకోవడం ఎందుకు? డియర్ సురేష్ బాబు గారూ నా పేరు కాస్త ఎక్కువగా వాడుతున్నట్టు ఉన్నారు మీ నాన్న పేరు మీ తమ్ముడి పేరు మీ పేరు మీ పెద్దబ్బాయి పేరే వాడుకుని ప్రమోషన్స్ చేసుకోండి నా పేరు పెట్టుకుని ప్రమోషన్స్ చేసుకోవడానికి సిగ్గుండాలి. అంటూ రెచ్చిపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here