Shreemukhi : ఎల్లో కలర్ లెహంగాలో పుత్తడిబొమ్మ రాములమ్మ

- Advertisement -

Shreemukhi : గ్లామర్, చలాకీతనం, స్పాంటెనిటీ, మెస్మరైజింగ్ స్టైల్.. మైండ్ బ్లోయింగ్ స్మైల్.. కిక్కెక్కించే డ్యాన్స్ మూవ్స్.. టాలీవుడ్ టాప్ యాంకర్ శ్రీముఖికి పర్ఫెక్ట్ గా సరిపోయే డిస్క్రిప్షన్ ఇది. చంద్రబింబంలాంటి తన అందంతో.. వెన్నెలలాంటి నవ్వుతో మాయ చేస్తూ ఉంటుంది. తన యాక్టివ్ నెస్ తో చుట్టూ ఉన్నవాళ్లను ఉత్సాహపరుస్తూ ఉంటుంది.

ప్రస్తుతం వరుస షోస్ చేస్తూ బుల్లితెరపై బిజీబిజీగా గడుపుతోంది. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటోంది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్ కొట్టేసింది. శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో శ్రీముఖి గ్లామర్ గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Actress Sreemukhi
Actress Sreemukhi

ఇక సోషల్ మీడియాలోనూ శ్రీముఖి చాలా యాక్టివ్. ఈ మధ్య బోల్డ్ ఔట్ ఫిట్స్ తో.. పొట్టిపొట్టి దుస్తుల్లో గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లకు కైపెక్కిస్తోంది. రోజురోజుకు హాట్ ట్రీట్ డోస్ పెంచేస్తూ కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది. అందాల ప్రదర్శనలో తాను హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని ప్రూవ్ చేస్తోంది.

- Advertisement -

 

Sreemukhi Photos
Sreemukhi Photos

ఇక తాజాగా తన బోల్డ్ నెస్ కు గ్యాప్ ఇచ్చింది. ఇవాళ ట్రెడిషనల్ డ్రెస్సులో సందడి చేసింది. ఎల్లో కలర్ లెహంగాలో బాపూబొమ్మలా కనిపించింది. ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో శ్రీముఖి కుందనపు బొమ్మలా ఉందంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. అందమైన కుందనాల బొమ్మరా అంటూ పొగిడేస్తున్నారు.

Sreemukhi

పుత్తడిబొమ్మ అలంకరణలో శ్రీముఖి అందం కుర్రాళ్లను మాయ చేస్తోంది. శ్రీముఖి ఇలా కళ్లు చెదిరే లెహంగాలో కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. శ్రీముఖి వివిధ యాంగిల్స్ లో ఇచ్చిన పోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. బీబీ జోడి షో కోసం శ్రీముఖి ఇలా అందంగా రెడీ అయింది.  సినిమాల్లో కూడా బుల్లితెర రాములమ్మ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here