Sreeleela : విజయం వెనుకే అపజయం ఉంటుందని చాలా సినిమాలు రుజువు చేశాయి. ఇప్పుడు హీరో విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరుగుతోంది. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్‌కి వెళ్లిపోయిన విజయ్.. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు మినహా ఓవరాల్‌గా అతని కెరీర్ మందకొడిగానే సాగుతోందని చెప్పాలి. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ‘లైగర్’ డిజాస్టర్ కావడంతో తన తర్వాతి సినిమా ‘ఫ్యామిలీస్టార్’పైనే ఆశలు పెట్టుకున్నాడు విజయ్. కానీ, ఆ సినిమా కూడా అతన్ని నిరాశపరచింది.

ఇప్పుడు తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే ఒక సాలిడ్ హిట్ అతనికి ఎంతో అవసరం. ఆ దిశగా అడుగులు వేస్తున్న విజయ్ తన నెక్స్‌ట్ మూవీపై కాన్‌సన్‌ట్రేట్ చేస్తున్నాడు. ‘జెర్సీ’ చిత్రంతో ఒక సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి, విజయ్ కాంబినేషన్‌లో సినిమా ఉందని ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. ఇప్పుడా సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు మేకర్స్. ఈ సినిమాను ఎనౌన్స్ చేసినపుడే శ్రీలీలను హీరోయిన్‌గా అనుకున్నారు. ఈ విషయాన్ని ఎనౌన్స్ చేశారు కూడా. ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కావడంలో జరిగిన జాప్యం వల్ల శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుందన్న వార్తలు వస్తున్నాయి. మరోపక్క సినిమాలో బోల్డ్‌గా నటించాల్సిన సీన్స్ కూడా ఉన్నాయని తెలియడంతో ఆమె ఈ సినిమా వద్దనుకుంది అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
కారణం ఏదైనా శ్రీలీల ఈ సినిమాలో నటించడం లేదన్నది వాస్తవం. శ్రీలీలకు యూత్‌లో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. అది విజయ్ దేవరకొండ సినిమాకు డెఫినెట్‌గా ప్లస్ అయ్యే అంశమే. అయితే శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుంది అనే వార్త విజయ్‌కి షాక్ ఇచ్చే విషయమే. గత కొంతకాలంగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. ఇటీవల ‘ప్రేమలు’ చిత్రంతో బాగా పాపులర్ అయిన మమిత బైజు పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నారు.