Mahesh Babu : యూరప్ లో ఎంజాయ్ చేస్తోన్న మహేశ్.. తర్వాత సినిమా సంగతేందంటున్న ఫ్యాన్స్..

- Advertisement -

Mahesh Babu టైం దొరికితే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్ళిపోతారని తెలిసిందే. ఇటీవల 15 రోజుల క్రితం మహేష్ బాబు తన ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ కి వెళ్లారు. ట్రిప్ లోఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు మహేష్. ఇన్ని రోజులుగా మహేష్ ఏ ఫొటోలు షేర్ చేయకపోయినా నమ్రత, సితార మాత్రం రెగ్యులర్ గా తమ యూరప్ ట్రిప్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Mahesh Babu
Mahesh Babu

దీంతో మహేష్ వెకేషన్ వైరల్ గా మారింది. తాజాగా మహేష్ యూరప్ ట్రిప్ నుంచి కొన్ని ఫొటోలు షేర్ చేశారు. అయితే ఫ్యామిలీతో కాకుండా అక్కడి ప్రదేశాలను ఎక్కువగా షేర్ చేసారు. తన కూతురు సితారతో కలిసి దిగిన ఓ క్యూట్ ఫొటో ఒకటి షేర్ చేశారు. ఈ ఫొటోలో మహేష్ తన కూతురుని ప్రేమగా హత్తుకొని ఉన్నాడు. అయితే ఈ ఫొటోలో మహేష్ జుట్టు కూడా బాగా పెంచినట్టు కనిపిస్తుంది. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది.

- Advertisement -

ఈ ఫొటో చూసి బెస్ట్ ఫాదర్ – డాటర్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ పెరిగిన జుట్టుని గమనించిన వాళ్ళు రాజమౌళి సినిమా కోసమే జుట్టు పెంచుతున్నాడా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సితార, గౌతమ్ లు ఉన్న ఫొటో కూడా షేర్ చేసాడు మహేష్ బాబు. దీంతో మహేష్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here