శ్రీలీల డ్యాన్స్ స్పీడ్ ముందు తేలిపోయిన కాజల్ అగర్వాల్..వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

‘అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ హీరో గా నటిస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. ప్రముఖ దర్శకుడు అని రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈమధ్యనే బాలయ్య పుట్టిన రోజు నాడు ‘భగవంత్ కేసరి’ మూవీ కి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా, దానికి ఆడియన్స్ నుండి అభూతమైన రెస్పాన్స్ వచ్చింది.

శ్రీలీల
శ్రీలీల

ఈ సినిమాలో బాలయ్య బాబు కెరీర్ లో మొట్టమొదటిసారి తెలంగాణ స్లాంగ్ ని వాడాడు. బాలయ్య మార్క్ యాక్షన్ ఉంటూనే, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కూడా ఉంటుంది అట ఈ చిత్రంలో.ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, బాలయ్య బాబు కి కూతురుగా శ్రీలీల నటిస్తుంది. రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి షూటింగ్ లొకేషన్ లో ఒక పాటకు డ్యాన్స్ వేస్తూ కనపడడం ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

ఇక ఈరోజు కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ‘భగవంత్ కేసరి’ మూవీ టీం కాజల్ అగర్వాల్ మరియు శ్రీలీల కలిసి సరదాగా వేసిన ఒక డ్యాన్స్ వీడియో ని విడుదల చేసింది. బాలయ్య సూపర్ హిట్స్ సాంగ్స్ లో ఒకటైన ‘చిలక పచ్చ కోక’ అనే పాటకు వీళ్లిద్దరు స్టెప్పులు వేశారు. అయితే ఈ డ్యాన్స్ వీడియో లో శ్రీలీల స్పీడ్ ముందు నిలబడలేకపోయింది కాజల్ అగర్వాల్.

- Advertisement -

పాపం శ్రీలీల స్పీడ్ ని మ్యాచ్ చెయ్యాలని ప్రయత్నం చేసింది కానీ, అది ప్రయత్నం లాగానే ఉంది. పెళ్ళై ఒక బిడ్డకి జన్మని ఇచ్చిన తర్వాత ఎవరికైనా శక్తి తగ్గడం సహజమే, కానీ కాజల్ అగర్వాల్ 22 ఏళ్ళ వయస్సు ఉన్న శ్రీలీల ని మ్యాచ్ చెయ్యడానికి చాలా కష్టపడింది. సినిమాలో కూడా ఆమెతో సమానంగా డ్యాన్స్ వేసిందో లేదో చూడాలి. పెళ్లి తర్వాత ఆమె తెలుగు లో చేస్తున్న మొట్టమొదటి చిత్రం ఇది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here