Sreelela : మోక్షజ్ఞ కోసం శ్రీలీల.. పెద్ద ప్లాన్ వేసిన బాలయ్య

- Advertisement -

Sreelela : ఇండస్ట్రీకి కొత్త వారసులు రాబోతున్నారు. వాళ్లు ఎవరో కాదు.. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఒకరు కాగా… మరొకరు ఎన్టీఆర్ బావమరిది. అయితే వీరు ఓకే కుటుంబం నేపథ్యం కలిగిన వారు. ఇక నందమూరి కుటుంబం నుంచి వీరు ఎంట్రీ ఇస్తున్నప్పటికీ.. దానికి తగ్గ అవుట్ పుట్ ఉంటేనే..ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకోసం వీరు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ సినిమా ఇంకా ఫైనల్ కాలేదు. ఎన్టీఆర్ బావమరిది నితిన్ మొదటి సినిమా మాత్రం పూర్తి అయింది.నందమూరి అభిమానులు ఎప్పటి నుండో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం కళ్లుకాయలు ఎదురుచూస్తున్నారు.

Sreelela
Sreelela

గత మూడేళ్లుగా ఇదిగో ఎంట్రీ..అదిగో ఎంట్రీ అంటున్నారు తప్ప అధికారికంగా మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ ఫై క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికా లో యాక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ గ్యారెంటీ అంటున్నారు. ఇదిలా ఉంటె మోక్షజ్ఞ మొదటిసినిమాలో హీరోయిన్ గా మాత్రం శ్రీలీలనే అని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ ఎవరా అంటే శ్రీలీల అని చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలకు జోడి కడుతుంది. అంతే కాదు బాలకృష్ణ – అనిల్ కలయికలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి మూవీ లో బాలకృష్ణ కూతురి పాత్రలో నటిస్తుంది.

శ్రీలీల

ఈ సినిమా సమయం లోనే బాలయ్య కు శ్రీలీల తెగ నచ్చేసిందట. పెద్దల పట్ల శ్రీలీల కి ఉన్న గౌరవం, ఆమెలోని చాలాకితనం బాలయ్య కి బాగా నచ్చిందట. వచ్చే ఏడాది నా కొడుకు సినిమాల్లోకి వస్తున్నాడు. వాడి మొదటి సినిమాలో నువ్వే హీరోయిన్ గా నటించాలి. మళ్ళీ డేట్స్ కుదర్లేదు లాంటి సాకులు చెప్పకూడదు ముందే చెప్తున్నా అని అన్నాడట. దానికి శ్రీలీల నవ్వుతు మీరు ఏది చెప్తే అదే అంటూ సమాధానం చెప్పిందట. దీనితో డైరెక్టర్ కూడా ఖరారు కాని బాలయ్య మొదటి సినిమాకి హీరోయిన్ గా శ్రీలీల ఫిక్స్ అని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా శ్రీలీల నటిస్తే సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here