Amardeep ని కమెడియన్ చెయ్యడమే నాగార్జున లక్ష్యమా..! ఇతర కంటెస్టెంట్స్ తప్పులను ఎందుకు చూపించడం లేదు?

- Advertisement -

Amardeep : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎంత ఆసక్తికరంగా సాగిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆద్యంతం ఉత్కంఠ ని కలిగించే ఆటలతో, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తో స్టార్ మా యాజమాన్యం కూడా ఊహించని రేంజ్ లో టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంది. ముందు సీజన్ ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో, ఈ సీజన్ అంతకు మించి రెండు రెట్లు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Amardeep
Amardeep

ఇకపోతే ఈ సీజన్ లో అమర్ దీప్ కి ప్రారంభం లో ఎంత నెగటివిటీ వచ్చిందో మనమంతా చూసాము. కానీ ఐదవ వారం నుండి టాస్కులు చక్కగా ఆడుతూ అమర్ దీప్ తన మీద ఉన్న నెగటివిటీ మచ్చ ని తుడిపేసుకొని పాజిటివ్ వైపు పరుగులు తీసాడు. అయితే అమర్ దీప్ ని ఎందుకో స్టార్ మా టీం చాలా ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చెయ్యాలని చూసినట్టు తెలుస్తుంది.

ఎందుకంటే గత వారం టికెట్ టు ఫినాలే టాస్కులో దాదాపుగా అందరూ కంటెస్టెంట్స్ ఫౌల్స్ చేసారు. అర్జున్ మరియు ప్రశాంత్ అయితే ఫజిల్ బాల్స్ టాస్క్ లో ఉద్దేశపూర్వకంగానే ఫౌల్ గేమ్ ఆడారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. కానీ స్టార్ మా ఛానల్ కేవలం అమర్ దీప్ మాత్రమే ఫౌల్ ఆడినట్టు చూపించారు. నిజానికి అమర్ దీప్ గత వారం టికెట్ టు ఫినాలే టాస్కు లో అద్భుతంగా ఆడాడు. ప్రతీ టాస్కులోను తన వంద శాతం పెర్ఫార్మన్స్ ఇచ్చి శబాష్ అనిపించుకున్నాడు.

- Advertisement -

ఆట ఆడే క్రమం లో పొరపాటున జరిగిన కొన్ని ఫౌల్స్ ని ఉద్దేశపూర్వకంగా చేసినట్టు, అసలు అమర్ దీప్ గేమ్ ఏమి ఆడనట్టుగా ప్రాజెక్ట్ చేసారు. ఇది ఆడియన్స్ కి చాలా బాధ కలిగించింది. సౌండ్ గెస్సింగ్ టాస్కు అమర్ స్పెల్లింగ్ కోసం గౌతమ్ దాంట్లో చూసినట్టు ఒప్పుకున్నాడు. కానీ ఫజిల్ గేమ్ టాస్కు లో ప్రశాంత్ మరియు అర్జున్ ఫౌల్ ఆడిన విషయాన్నీ ఒప్పుకోగలరా?, ఎందుకు స్టార్ మా ఛానల్ అమర్ ని ఇంతలా టార్గెట్ చేసింది?, అతని కుటుంబ సభ్యులు అనవసరంగా బిగ్ బాస్ కి వెళ్ళాడు అని అనిపించే రేంజ్ లో అమర్ దీప్ ని కమెడియన్ చెయ్యాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here