Sreeleela : ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది శ్రీలీల. తెలుగు ప్రేక్షకులకు ముద్దుగుమ్మ తెగ నచ్చేయడంతో ఏకంగా డజన్ సినిమాలకు పైగా అవకాశం కల్పించారు. ఆ సినిమా తర్వాత అమ్మడు టాలీవుడ్ క్రష్ గా మారిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకుంది శ్రీ లీల. అలాంటి ఆమె అల్లు అర్జున్ కి భారీ ఝలక్ ఇచ్చిందా అంటే నిజమనే సమాధానమే వస్తోంది. శ్రీలీల మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. నటన, పాటలు, డాన్స్ అబ్బో ఒకటా రెండా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో క్వాలిటీలున్నాయి.

రీసెంట్ గా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాలో ఆమె వేసిన డ్యాన్స్ హైలైట్ గా మారింది. అయితే ఆమె డ్యాన్స్ చూసిన.. సుకుమార్ పుష్ప 2 సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆమెను సెలక్ట్ చేసుకున్నారట. బన్నీ చేత హై రికమండేషన్ తో ఆమెకు కాల్ కూడా చేయించారట. కానీ శ్రీ లీల మాత్రం ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నేను అలా స్పెషల్ సాంగ్ చేయనంటూ ముఖం మీదే చెప్పేసిందిట .

ప్రస్తుతం ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. దీనికి కారణం లేకపోనూ లేదు. శ్రీలీలను గుంటూరు కారం తర్వాత చాలామంది కేవలం డ్యాన్స్ కే పనికొస్తుందంటూ ట్రోల్ చేశారు. ఆ మాటలకి హర్ట్ అయిన శ్రీలీల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గుంటూరు కారం సినిమా టాక్ తో శ్రీలీలకి బాగానే బుద్ది వచ్చిన్నట్లు ఉందంటున్నారు జనాలు.