Sreeja – Kalyan Dev : మెగా ఫ్యామిలీ లో చిరంజీవి చిన్న కూతురు శ్రీజా కి రెండు సార్లు పెళ్లి జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే. మొదటి పెళ్లి భరద్వాజ్ అనే అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్ళకు అతనితో కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి ఆమెకి రెండవ సారి కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తి తో పెళ్లి చేసాడు. ఈ దంపతులిద్దరికీ ఒక పాప కూడా ఉంది.
కొన్నాళ్ళు పాటు చాలా సాఫీగా సాగిన వీళ్లిద్దరి కాపురం కొని అనుకోని కారణాల వల్ల విభేదాలను ఏర్పరచుకొని విడిపోవాల్సి వచ్చింది అని తెలుస్తుంది. వీళ్లిద్దరు చాలా కాలం నుండి దూరంగానే ఉంటున్నారు. కానీ విడాకులు తీసుకున్న విషయాన్ని మాత్రం అధికారికంగా తెలియచెయ్యలేదు. కానీ ఈమధ్య కాలం లో మళ్ళీ వీళ్లిద్దరు కలిసిపోయారని, విడాకులు క్యాన్సిల్ చేసుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రీసెంట్ గా చూసిన కొన్ని ఫోటోలను చూస్తే అర్థం అయ్యింది.
పూర్తి వివరణలోకి వెళ్తే రీసెంట్ గా వీళ్లిద్దరి గారాల పట్టి నివిష్క 5వ సంవత్సరం లోకి అడుగుపెట్టింది. ఈమెతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మరోపక్క శ్రీజా కూడా నివిష్క తో కలిసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న ఫోటోలను అప్లోడ్ చేసింది. కళ్యాణ్ దేవ్ జరుపుకున్న వేడుకలు ఒక ప్లేస్ లో, అలాగే శ్రీజా జరుగుపుకున్న వేడుకలు మరో ప్లేస్ ఉన్నాయి.
అంటే ఎవరికీ వారు ప్రత్యేకంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు అన్నమాట. అంటే వీళ్ళు కలిసి ఉండట్లేదు, విడిపోయారు అని చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం మరొకటి ఏముంటుంది చెప్పండి. కానీ మీడియా రచ్చ రచ్చ చేస్తుంది అనే కారణం చేత వీళ్ళు విడాకులు తీసుకున్న విషయం అధికారికంగా చెప్పలేదేమో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.