VarunLav : వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్ళిలో కళ్యాణ్ దేవ్.. శ్రీజా విడాకులు రద్దు చేసుకున్నట్టేనా?

- Advertisement -

VarunLav : మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మరియు ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక నిన్న ఇటలీ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మెగా కుటుంబం తో పాటుగా టాలీవుడ్ లో వరుణ్ తేజ్ కి బాగా దగ్గరైన కొంతమంది ముఖ్యమైన సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. అలా గ్రాండ్ గా జరిగిన ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

VarunLav
VarunLav

మెగా ఫ్యామిలీ హీరోలందరిని ఒకే చోట చూడడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పొయ్యింది. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ వివాహానికి చిరంజీవి చిన్న కూతురు శ్రీజా మాజీ భర్త కళ్యాణ్ దేవ్ కూడా హాజరైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం వీళ్లిద్దరు విడిపోయినట్టు సోషల్ మీడియా లో ఒక వార్త బాగా ప్రచారమైంది.

Kalyan Dev Sreeja

వీళ్లిద్దరి విడాకుల గురించి అధికారికంగా ప్రకటించకపోయినా, అనధికారికంగా ఇద్దరికీ విడాకులు జరిగి చాలా కాలమే అయ్యింది. గతం లో నిహారిక మరియు చైతన్య పెళ్ళికి వీళ్ళిద్దరూ జంటగా హాజరయ్యారు. కానీ ఈసారి వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్ళికి విడివిడిగానే హాజరయ్యారు. శ్రీజా తో విడాకులు తీసుకున్నప్పటికీ కళ్యాణ్ దేవ్ కి మెగా ఫ్యామిలీ లో కొంతమంది తో ఇప్పటికీ సాన్నిహిత్యం ఉందట.

- Advertisement -
Sreeja

వరుణ్ తేజ్ కళ్యాణ్ దేవ్ కి బెస్ట్ ఫ్రెండ్ కూడా అట. అందుకే ఆయన ఈ పెళ్ళికి హాజరు అయ్యినేట్టు చెప్తున్నారు. అయితే ఆయనకీ సంబంధించిన వీడియోలు కానీ, ఫోటోలు కానీ ఒక్కటి కూడా విడుదల అవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అవి బయటకి రాకపోయినా పెళ్లి వీడియో లో కచ్చితంగా కనిపిస్తాడని అంటున్నారు. మరోపక్క కళ్యాణ్ దేవ్ ఈ పెళ్ళికి రావడం తో శ్రీజా తో ఆయన విడాకులు రద్దు చేసుకున్నాడేమో అని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు, చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here