Salaar : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం పై అభిమానులతో పాటుగా కోట్లాది మంది ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 22 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ ఈ చిత్రం మీద ఉన్న అంచనాలను మొత్తం నీరు గార్చింది.

అదేంటి వేరే లెవెల్ లో ఊహించుకున్నాం, ప్రభాస్ కి సంబందించిన షాట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, ఎలివేషన్స్ కూడా చాలా రొటీన్ గా ఉన్నాయి, మళ్ళీ మనకి ఫ్లాప్ తప్పదా అనే బాధలో ఉండిపోయారు ఫ్యాన్స్. అలాంటి ఫ్యాన్స్ కి నిన్న విడుదలైన ‘సూరీడు’ అనే లిరికల్ వీడియో సాంగ్ సరికొత్త ఊపుని ఇచ్చింది. ఎక్కడ చూసిన ఈ పాట గురించే ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు.

ప్రభాస్ మరియు పృథ్వి రాజ్ మధ్య ఉన్న ఎమోషనల్ స్నేహ బంధం గురించి చెప్తూ సాగే ఈ పాటకి ఆడియన్స్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఒక సినిమా వేరే లెవెల్ కి వెళ్ళాలి అంటే ఆ చిత్రం లో కచ్చితంగా ఎమోషనల్ డ్రామా తప్పనిసరిగా ఉండాల్సిందే. కేజీఎఫ్ సిరీస్ అందుకే అంత పెద్ద హిట్ అయ్యింది. సలార్ చిత్రం లో ఆ ఎమోషనల్ డ్రామా ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందని ఈ పాటని చూస్తే అర్థం అవుతుంది.

నిన్నటి వరకు ఈ సినిమాకి సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ యావరేజి రేంజ్ లో ఉండేవి. ఈ పాట తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ మార్కు ప్రీమియర్ ని అవలీల గా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. సలార్ కి కావాల్సిన బూస్ట్ వచ్చేసింది, ఇక ఈ డైనోసర్ గర్జన కి ఎన్ని రికార్డ్స్ బలి అవుతాయో చూడాలి.