2నిమిషాలకే అరకోటి అందుకున్న ఆదిపురుష్‌ భామ.. వామ్మో అంటున్న నెటిజన్లు

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన తొలి మైథ‌లాజిక‌ల్ మూవీ ఆదిపురుష్‌ జూన్ 16న అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన ఈ విజువ‌ల్ వండ‌ర్ లో రాముడిగా ప్ర‌భాస్, సీత‌గా కృతి స‌న‌న్ న‌టించారు. అలాగే రావ‌ణాసురుడు పాత్ర‌ను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలకే పరిమితమైన సంగతి తెలిసిందే.

SOnal CHauhan

అయినాస‌రే బాక్సాఫీస్ వ‌ద్ద ఆదిపురుష్ అదిరిపోయే రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ఇక‌పోతే ఈ సినిమాలో కృతి స‌న‌న్ తో పాటు సోనాల్ చౌహాన్‌ కూడా ఇందులో కీలకపాత్రలో కనిపించింది. ఈ బ్యూటీ రావ‌ణాసురుడు అయిన సైఫ్ అలీ ఖాన్ స‌తీమ‌ణి మండోద‌రి పాత్ర‌లో మెరిసింది. అయితే, రామాయణంలో అంత ప్రాధాన్యత ఉన్న ఈ పాత్రకు డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఎలాంటి ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. మూడు గంటల సినిమాలో కేవలం రెండు నిమిషాలే కనిపించేలా చేశారు.

sonal

అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుందో ఏమో ఈ అమ్మడు ఆదిపురుష్‌ కోసం భారీగా రెమ్యునరేషన్‌ అందుకుందిట. రెండు సీన్ల కోసం సోనాల్ రెండు రోజులు షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం. ఆ మాత్రానికే ఆమె ఏకంగా రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంద‌ని టాక్ న‌డుస్తోంది. కాగా, సోనాల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. తెలుగులో ఆమె ప‌లు చిత్రాల్లో మెరిసింది. చివ‌రిగా నాగార్జున ది ఘోస్ట్‌ మూవీలో న‌టించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here