మంచు మోహన్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ గత ఏడాది విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మోహన్ బాబు తనయుడు మంచి విష్ణు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత విడుదలైన చిత్రం ఇది. అప్పటికే ఆయన మీడియా ముందు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్ అయ్యి ఉన్నాడు.
మోహన్ బాబు పై మరియు విష్ణు పై విపరీతమైన నెగటివిటీ ఉండేది. అలాంటి సమయం లో వచ్చిన ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి షేర్ వసూళ్లు కాదు కదా, కనీసం గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. గతం లో మంచు విష్ణు తో ‘ఈడో రకం..ఆడో రకం’ వంటి సూపర్ హిట్ సినిమాకి డైరెక్టర్ గా పని చేసిన డైమాం రత్నం బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
ఇప్పుడు ఆయన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ సన్నీ తో ‘అన్ స్టాపబుల్’ అనే చిత్రాన్ని చేసాడు. ఈ నెలలోనే విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు డైమండ్ రత్నం బాబు. అయితే ఈ సందర్భంగా ఆయన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా తాలూకు జ్ఞాపకాలను చెప్పుకొచ్చాడు. ఈ చిత్రాన్ని తొలుత సూపర్ స్టార్ రజినీకాంత్ తో తీద్దాం అనుకొని ఆయనకీ స్టోరీ వినిపించాడట.
స్టోరీ విన్న తర్వాత రజినీకాంత్ సినిమాలో ఎన్నో మార్పులను సూచించి, ఇది నా మిత్రుడు మోహన్ బాబు తో చెయ్యమని చెప్పాడట. అయితే డైమండ్ రత్నం బాబు కి కథలో మార్పులు చెయ్యాలని అనిపించలేదట. ముందుగా ఎలా అయితే స్క్రిప్ట్ ని రాసుకున్నాడో , అలాగే మోహన్ బాబు తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ తర్వాత ఫలితం ఏమొచ్చిందో మన అందరికీ తెలిసిందే. రజినీకాంత్ గారు సూచించిన మార్పులు చేసి సినిమా తీసి ఉంటే హిట్ అయ్యేదేమో అని డైమండ్ రత్నం రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.