Sobhita Dhulipalaసమంత చేసిన పొరపాట్లు నేను చేయను అంటూ శోభిత దూళిపాళ్ల!

- Advertisement -

Sobhita Dhulipala : సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని నాగ చైతన్య రీసెంట్ గానే ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే వీళ్లిద్దరికీ పెళ్లి కూడా జరగనుంది. చాలా కాలం నుండి డేటింగ్ చేసుకుంటున్న వీళ్లిద్దరు, ఎట్టకేలకు వైవాహిక బంధంతో ఒక్కటి అవ్వబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా శోభిత బాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సమంత ని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రణవీర్ సింగ్ హీరో గా బాలీవుడ్ లో ‘డాన్ 3’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

sobhita dhulipala
sobhita dhulipala

షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘డాన్’ , ‘డాన్ 2’ చిత్రాలకు కొనసాగింపుగా ఈ డాన్ 3 చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో ఐటెం సాంగ్ వస్తుందట. ఈ ఐటెం సాంగ్ కోసం శోభిత దూళిపాళ్ల ని సంప్రదించారట మేకర్స్. అయితే ఆమె ఎలాంటి మొహమాటం లేకుండా మేకర్స్ కి నో చెప్పి వెనక్కి పంపేసిందని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నాని, పెళ్ళికి ముందు కానీ, పెళ్లి తర్వాత కానీ ఐటెం సాంగ్స్, రొమాంటిక్ సీన్స్ ఇక మీదట చేయబోనని చెప్పిందట. అంతే కాకుండా కొంతమంది హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా ఇలాంటివి చేస్తున్నారని, అది పూర్తిగా వాళ్ళిష్టం కానీ నేను మాత్రం చేయబోనని తెగేసి చెప్పిందట. అంటే ఆమె పరోక్షంగా సమంత మీద సెటైర్లు వేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది.

Sobhita Dhulipala's latest Instagram post fuels speculation about her relationship with Naga Chaitanya | Telugu Movie News - Times of India

- Advertisement -

ఎందుకంటే సమంత నాగ చైతన్య తో వైవాహిక బంధం ఉన్న రోజుల్లోనే ఫ్యామిలీ మెన్ సీజన్ 2 చేసింది. ఇందులో ఆమె ఎంత బోల్డ్ గా కనిపించిందో మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నాగ చైతన్య తో విడాకులు అయ్యాక ఆమె ‘పుష్ప’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. కాబట్టి శోభిత పరోక్షంగా అన్న మాటలు సమంత ని ఉద్దేశించినవే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే శోభిత చేతిలో ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వగానే ఆమె నాగ చైతన్య ని వివాహం చేసుకునేందుకు సిద్ధం అవ్వబోతుంది.

Sobhita Dhulipala once admitted she 'admired' this about Naga Chaitanya, Samantha Ruth Prabhu - Hindustan Times

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here