థియేటర్స్ రంగం లో అగ్రగామి గా పేరు గాంచిన ఏషియన్ మల్టిప్లెక్స్ చైన్స్ అధినేత సునీల్ నారంగ్ ఈమధ్య హైదరాబాద్ లో మన స్టార్ హీరోలతో కలిసి మల్టిప్లెక్స్ లు పార్టనర్ షిప్ ద్వారా నిర్మిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఇప్పటికే మహేష్ బాబు తో AMB సినిమాస్ గచ్చిబౌలి ప్రాంతం లో, అలాగే విజయ్ దేవరకొండ తో AVD సినిమాస్ మహబూబ్ నగర్ లో ప్రారంభించారు.

వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖాయంగా AMB సినిమాస్ హైదరాబాద్ లో ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఏషియన్ సినిమాస్ సంస్థ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి AAA సినిమాస్ హైదరాబాద్ లోని అమీర్ పెట్ ప్రాంతం లో నిర్మించారు. నేడు ఈ మల్టిప్లెక్స్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు అల్లు అర్జున్ మరియు అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు.

అయితే ఈ AAA సినిమాస్ లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటో ఒక్కసారి ఇప్పుడు చూద్దాము. ఒకప్పుడు అమీర్ పెట్ లో సత్యం థియేటర్ ఎంత ఫేమస్ అనేది మన అందరికీ తెలిసిందే, ఆ థియేటర్ ని పడగొట్టి, ఈ మల్టిప్లెక్స్ ని నిర్మించారు. మూడు లక్షల స్క్వేర్ ఫీట్ లో ఈ మాల్ ని నిర్మించారు. కేవలం పార్కింగ్ కోసం రెండు ఫ్లోర్స్ ని ఏర్పాటు చేశారట. ఈ మల్టిప్లెక్స్ లో టోటల్ గా 5 స్క్రీన్ లు ఉంటాయి. అందులో స్క్రీన్ 1 67 ఫీట్ల పొడవుతో బార్కో లంజెర్ ప్రొజెక్షన్ తో సినిమాలను ప్రదర్శిస్తారట.

ఇక రెండవ స్క్రీన్ EPIC లక్సన్ స్క్రీన్ అట. ముంబై సిటీ లో తప్ప ఎక్కడ కూడా ఈ LED స్క్రీన్ లేదు. ఒక్క AAA సినిమాస్ లో అల్లు అర్జున్ ఈ టెక్నాలజీ ని హైదరాబాద్ లో పరిచయం చేస్తున్నాడు. ఈ స్క్రీన్ కి ప్రొజెక్టర్ అవసరం లేదు, కేవలం కనెక్షన్ ద్వారా ప్లే అవుతుంది. మిగిలిన మూడు స్క్రీన్స్ కూడా 4K ప్రొజెక్షన్ తో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం తో ఉంటుందట. చూస్తే ఇలాంటి థియేటర్ లోనే చూడాలి అనిపించేంత అనుభూతి కలుగుతుందని అంటున్నారు , రేపు ఆదిపురుష్ చిత్రం ఈ థియేటర్స్ లో ప్లే అవ్వబోతుంది, చూడాలి మరి రెస్పాన్స్ ఎలా ఉంటుందో.
