SJ Surya : మహేశ్​బాబుపై ‘ఖుషి’ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్.. ఆ మాటలు చాలా బాధ పెట్టాయంటూ..

- Advertisement -

ఎస్​జే సూర్య.. ఖుషి సినిమాతో టాలీవుడ్, కోలీవుడ్​లలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. పవన్ కల్యాణ్​కు తన సినీ కెరీర్​లో తిరుగులేని బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని బ్లాక్​బస్టర్ బంపర్ హిట్స్ ఇచ్చినా అవన్నీ ఖుషి ముందు దిగదుడుపేనని ఫ్యాన్స్ అంటూ ఉంటారు. ఇప్పటికీ ప్రతి ఒక్కరి ఫేవరెట్ మూవీస్​ లిస్టులో ఈ సినిమా ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. ఇక ఏ మూవీలో హీరోయిన్ నడుము అందాలు చూపించినా.. ఖుషిలో భూమిక నడుముని SJ Surya చూపించినంత అందంగా ఎవరూ చూపించలేరని ఫీల్ అవుతుంటారు.

SJ Surya
SJ Surya

తెలుగు నాట అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు ఎస్​జే సూర్య. ఆ తర్వాత పలు సినిమాలు చేసినా అవి అంతగా ఆదరణ పొందలేదు. ఇక సినిమాలు డైరెక్ట్ చేయడానికి బ్రేక్ ఇచ్చి.. తన ఫేవరెట్ అయిన యాక్టింగ్​పై ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పటికే మహేశ్ బాబుతో కలిసి స్పై, శింబుతో కలిసి మహానాడులో సందడి చేశాడు. ఇక విలన్ రోల్స్​లో ఎస్​జే సూర్యని మించిన విలనిజం ఎక్కడా చూడలేమన్నంతగా అదరగొడ్తాడు. ఇక లేటెస్ట్​గా RC15లో శంకర్ డైరెక్షన్​లో నటిస్తున్నాడు సూర్య.

ప్రజెంట్ వదంతి అనే ఓ సినిమాతో వస్తున్నాడు ఎస్​జే సూర్య. ఈ మూవీలో ఆయన పోలీస్ ఆఫీసర్​గా అదరగొట్టనున్నాడు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సూర్య బిజీ బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ తెలుగు ఛానెల్​కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో సూర్య ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

- Advertisement -

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా తాను దర్శకత్వం వహించిన ‘నాని’ సినిమా వైఫల్యంపై దర్శకుడు, నటుడు ఎస్‌.జె.సూర్య తాజాగా స్పందించాడు. సినిమా పరాజయం తర్వాత మహేశ్‌ అన్న ఓ మాట తననెంతో బాధపెట్టిందని చెప్పాడు. ఇంతకీ మహేశ్ బాబు ఏమన్నాడంటే..?

‘‘నాని’ సినిమా విషయంలో నాకింకా బాధగానే ఉంది. హీరో కావాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి వచ్చా. నటుడిగా ఎదగడం కోసం మొదట దర్శకుడిని అయ్యాను. ప్రతి చిత్రాన్ని ప్రేమ, ఉత్సాహంతో చేశా. కానీ, ‘నాని’ అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా విడుదలయ్యాక ఓసారి మహేశ్‌.. ‘మీరు ఈ చిత్రాన్ని ఎంత ఇష్టపడి చేశారో నాకు తెలుసు. ఫలితాన్ని పక్కనపెడితే మిమ్మల్ని, మీ వర్క్‌ను నేను అభిమానిస్తున్నా’ అని అన్నారు. ఆయన మాట నాకింకా బాధను కలిగించింది. పవన్‌ కల్యాణ్‌కు హిట్‌ ఇచ్చా. మహేశ్‌కు ఇవ్వలేకపోయాననే బాధ ఉండిపోయింది. అయితే, ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే ఉంది. నటనపై మక్కువ తగ్గితే.. మళ్లీ దర్శకుడిగా మహేశ్‌తో సినిమా చేసి.. హిట్‌ అందుకుంటా’’ అని ఆయన వివరించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com