Siri Hanmanth : షన్నుతో చేసిన రొమాన్స్ పై తప్పు ఒప్పుకున్న సిరి.. స్టేజ్ పైనే కన్నీళ్లు.. వీడియో వైరల్..

- Advertisement -

బిగ్ బాస్ హౌస్ లో Siri Hanmanth , షన్నులు చేసిన పనికి తెలుగు ప్రజలు అవాక్కయిన విషయం తెలిసిందే.. ఈ ఇద్దరికీ బయట లవర్స్ ఉన్నారు. వాళ్ళతో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు.. కానీ హౌస్ లో ఇలాంటి పనులు చెయ్యడం.. అది కూడా అన్ని కెమెరాలు ఉన్నా కూడా హద్దులు దాటడం పై పలు విమర్శలు అందుకున్నారు. సిరి, షన్నులు మాత్రం హగ్గులు, ముద్దులంటూ నానా రచ్చ చేశారు. సిరి తల్లి అయితే షన్నుతో దూరంగా ఉండు.. అన్నలాంటి వాడు అని చెప్పి.. హింట్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

siri hanmanth
siri hanmanth

అయినా కూడా సిరి బుద్ది మారలేదు.. ముద్దులు, హగ్గులతో పైకి ఫ్రెండ్స్ అంటూనే రెచ్చిపోయారు..షన్ను లైఫ్ పూర్తిగా మారిపోయింది. బయటకు వచ్చిన తరువాత దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. కొన్ని రోజులు సిరి, శ్రీహాన్‌లు కూడా మాట్లాడుకున్నట్టుగా కనిపించలేదు. చివరకు రవి ఇంట్లో సిరి, శ్రీహాన్‌లు కలిసినట్టుగా ఓ ఫోటో బయటకు వచ్చింది.. సిరి లైన్ క్లియర్ అయ్యింది కానీ.. షన్ను లైఫ్ మాత్రం పూర్తిగా మారిపోయింది..

siri hanmanth abchor ravi

అలా బిగ్ బాస్ షోతో రెండు జంటల మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పుడు సిరి, శ్రీహాన్‌లు బాగానే కలిసి ఉన్నారు. శ్రీహాన్ ఆరో సీజన్‌లో ఉండగా.. బయట నుంచి సిరి బాగానే సపోర్ట్ చేసింది. శ్రీహాన్ కోసం బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన సిరి.. లిప్ లాక్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. ఒంటి మీద టాటూ కూడా వేయించుకుంది.. షన్ను, దీప్తి మాత్రం బ్రేకప్ చెప్పేసి ఎవరి లైప్ వాళ్ళు బిజీ అయ్యారు.. ఇప్పుడు వాలెంటైన్స్ డే స్పెషల్‌గా చేస్తోన్న లవ్ టుడే షోలో సిరి తన తప్పులను ఒప్పుకుంది. ఇలా స్టేజ్ మీద ఎవరూ కూడా తప్పులను ఒప్పుకోరు.. తెలిసో తెలియకో తప్పులు చేశా అని సిరి కన్నీరు కార్చేసింది. దీంతో శ్రీహాన్, రవిలు దగ్గరకు తీసుకుని ఓదార్చారు.

- Advertisement -

మొత్తానికి బిగ్ బాస్ ఇంట్లో చేసిన తప్పులకు సిరి పశ్చాతాప్పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక సిరి, శ్రీహాన్‌ల పెళ్లి మీద వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. త్వరలోనే వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని సమాచారం.. ఆ లవ్ టుడే షో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here