Sir trailer review : న్యాయం కోసం పోరాటం..యాక్షన్ సన్నివేశాల్లో ధనుష్ డైలాగులు..

- Advertisement -

Sir trailer review : కొలివుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా సార్.. తెలుగులో, తమిళ్ భాషలో ఏక కాలంలో విడుదల కానుంది..ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది.’సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’, ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌’ బ్యానర్ల పై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన లుక్ పోస్ట్లు, టీజర్లు, ట్రైలర్లు జనాలను ఆకట్టుకున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది..

Sir trailer review
Sir trailer review

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల డోస్ ను పెంచుతూ ఇప్పుడు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ 2 నిమిషాల 26 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ‘ గ్రామీణ ప్రాంతాల్లోని ఉండే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి పలు ప్రభుత్వ కళాశాలలు దత్తత తీసుకుంటున్నట్లు ఓ ప్రైవేటు విద్యాసంస్థ ఛైర్మన్ ప్రకటిస్తుంది. ఈ క్రమంలో కొంతమంది అధ్యాపకులను ఆయా కళాశాలలకు పంపుతుంది. అందులో మన ధనుష్ కూడా ఒకరు.. అయితే అక్కడ జరిగే అన్యాయల గురించి బయట పెడతారు.

సంయుక్త మీనన్ పరిచయమవ్వడం, ఆమెతో ప్రేమలో పడటం వంటివి ట్రైలర్లో చూపించారు.అటు తర్వాత హీరో ధనుష్ ఎడ్యుకేషన్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడటం దానికి ఓ బ్యాక్ స్టోరీ ఉన్నట్టు కూడా ట్రైలర్లో చూపించారు. ‘డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు… కానీ మర్యాద చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది…’ అంటూ ధనుష్ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలుస్తుంది..జి వి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ కు హైలెట్ గా నిలుస్తుంది. మరి ఇప్పటివరకు లవ్ స్టోరీలతో అలరించిన దర్శకుడు వెంకీ అట్లూరి.. ‘సార్’ తో కమర్షియల్ డైరెక్టర్ గా కూడా మారతాడేమో చూడాలి. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here