Singer Sunitha : హీరోయిన్లకు అసూయ పుట్టిస్తున్న అందంతో సింగర్ సునీత కూతురు.. అబ్బా ఏముంది భయ్యా ..

- Advertisement -

Singer Sunitha : పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఆమె గొంతు మధురం.. ఆమె పాటలు అద్భుతం.. ఎన్నో పాటలతో జనాలను ఆకట్టుకుంటుంది.. ఆమే పాట కోసం విదేశీయులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. తెలుగులో టాప్ సింగర్ గా ఈమె మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. తన అద్భుతమైన గాత్రంతో పాటలు పాడి ఎన్నో అవార్డులను రివార్డులను సైతం అందుకుంది..కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతోమంది హీరోయిన్లకు ఎన్నో సినిమాలు డబ్బింగ్ చెప్పింది ఒకవైపు పాటల కార్యక్రమానికి కూడా జడ్జిగా వ్యవహరిస్తూ ఉంటుంది.

Singer Sunitha
Singer Sunitha

మొదట గులాబీ సినిమాలోని పాటలు పాడి తన సినీ కెరియర్ను మొదలుపెట్టింది. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనె స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది..సునీత వ్యక్తిగత విషయానికి వస్తే మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత.. గడచిన రెండు సంవత్సరాల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈమె వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంది. సునీతకు ఇద్దరు పిల్లలు కలరు. అందులో అబ్బాయి పేరు ఆకాష్ అమ్మాయి పేరు శ్రేయ.. సునీత కుమారుడు ఆకాష్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డైరెక్టర్ రాఘవేంద్రరావు తెరకెక్కించబోతున్న సర్కార్ నౌకరి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది..

Singer Sunitha Daughter

ఇక కూతురు శ్రేయ..తన తల్లిలాగే చాలా అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈమె విదేశాలలో చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య నటించిన సవ్యసాచి అనే సినిమాలో సునీత కూతురు ఒక పాట పాడింది. ఈమె గాత్రం కూడా బాగుందని సంగీతం అంటే చాలా ఇష్టం అని కూడా తెలియజేసింది. కానీ ఇటీవల ఫారిన్ లో చదువుతున్న తన కూతురును కలిసేందుకు వెళ్లిన సునీత అక్కడ తన కూతురిని కౌగిలించుకొని ఎమోషనల్ అవుతున్న ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.. అంతేకాదు కొన్ని పిక్స్ ను కూడా షేర్ చేసింది.. వాటిని చూసిన అభిమానులు హీరోయిన్లకు అసూయ పుట్టిస్తున్న అందంతో శ్రేయ ఉంది.. హీరోయిన్ అయితే అందరూ క్యూ కడతారు అని కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి ఆ పోస్ట్ వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here