అతిశయం కొన్ని కొన్ని సార్లు తీవ్రమైన నష్టాలను తెచ్చిపెడుతుంది, అందుకు ఉదాహరణ రీసెంట్ గా రీ రిలీజ్ అయినా జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమానే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అభిమానులు మరియు PR టీం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే #RRR చిత్రం తో జూనియర్ ఎన్టీఆర్ పాన్ వరల్డ్ రేంజ్ లో పాపులారిటీ మరియు క్రేజ్ ని సంపాదించాడు.

ఆయన నుండి సోలో హీరో గా సినిమా విడుదలై 5 ఏళ్ళు కావొస్తుంది. 2018 వ సంవత్సరం లో విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రమే ఆయన చివరి సారిగా సోలో హీరో గా వెండితెర మీద కనిపించిన చిత్రం. పైగా అంతకు ముందు రీ రిలీజ్ అయిన ఖుషి చిత్రానికి భారీ స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఆ మూవీ కలెక్షన్స్ ని దాటి నెంబర్ 1 అవ్వాలనే కసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కనిపించింది.

అందుకోసం నెల రోజుల ముందు నుండే పబ్లిసిటీ ప్రారంభించారు.ప్రత్యేకంగా లిరికల్ వీడియో సాంగ్ చేయించి థియేటర్ లో విడుదల చేసారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి పెద్ద పెద్ద సెలెబ్రిటీలను పిలిచారు. వీటి అన్నిటికీ ఖర్చు దాదాపుగా మూడు కోట్ల రూపాయిల వరకు అయ్యింది అట. ఈ చిత్రం కచ్చితంగా ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొట్టి, పది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని అనుకున్నారు. అయితే ఈ చిత్రం మొదటి రోజు నుండే ఖుషి రికార్డ్స్ కి దరిదాపుల్లో కూడా రాలేకపోయింది.

మొదటి రోజు ఖుషి చిత్రం నాలుగు కోట్ల 15 లక్షల రూపాయిలు వసూలు చెయ్యగా,ఫుల్ రన్ లో 7 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. మరోపక్క సింహాద్రి మొదటి రోజు మూడు కోట్ల 50 లక్షల రూపాయిలు రాబట్టగా, ఫుల్ రన్ లో 3 కోట్ల 80 లక్షలు వచ్చాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం పది కోట్ల రూపాయిల గ్రాస్ రాబట్టాలి, కానీ చివరికి నష్టాలే మిగిలించింది.