అనుకున్న పని చేసిన దీప్తి సునయనా.. అంత డబ్బు ఎలా సంపాదించావంటున్న జనాలు

- Advertisement -

గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాన్ని మంచి సాధనంగా ఉపయోగించుకుంటూ అనేక మంది పాపులర్ అయ్యారు. నెట్టింట్లో సందడి చేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న క్యూట్ బ్యూటిల్లో దీప్తి సునైనా ఒకరు. యూట్యూబ్ డబ్ స్మాష్ వీడియోల ద్వారా పాపులర్ అయిన దీప్తి సునైనా అందానికి అందం, టాలెంట్‌‌కు టాలెంట్‌ ఉండటంతో అతి తక్కువ సమయంలో మోస్ట్ పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా దీప్తి ఇచ్చే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు యూత్ ఫిదా అయిపోవడమే కాకుండా ఆమెను క్రష్ లిస్ట్ లో కూడా చేర్చారు.

దీప్తి సునయనా
దీప్తి సునయనా

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే దీప్తీ సునైనా అప్పుడప్పుడు తన కాంట్రవర్సీలతో నెటిజన్ల ఆగ్రహానికి కూడా గురి అవుతుంది.. కొన్నిసార్లు నెటిజన్ల ప్రశ్నలకు స్ట్రాంగ్ గా సమాధానాలు కూడా చెబుతుంది. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈ అమ్మడు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఇటీవల షన్నుతో బ్రేకప్ చెప్పిన దీప్తి సునైనా తన ఫ్రెండ్స్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ఒంటరితనాన్ని దూరం చేసుకుంటుంది. సమయం చిక్కినపుడు తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది. ఈ క్రమంలో తన అభిమానులతో ముచ్చటిస్తున్న దీప్తి సునైనాకు ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది.

Deepthi sunaina new house

ఇటీవల దీప్తి కొత్త ఇల్లు కొనడం గురించి ఒక నెటిజన్ అడిగాడు. “మీరు ఇల్లు ఎలా కొన్నారు” అని ప్రశ్నించాడు ఆ నెటిజన్. దానికి కౌంటర్ గా మంచి జవాబు ఇచ్చింది దీప్తి సునయనా. నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. “యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి నేను సంపాదించిన దాంట్లో 30 శాతం ఖర్చు పెట్టుకుని మిగతా 70 శాతం డబ్బు సేవ్ చేసుకున్నాను. అలా దాచుకున్న డబ్బులతో కొత్త ఇల్లు కొన్నాను” అని సమాధానం ఇచ్చింది బ్యూటిఫుల్ అండ్ క్యూట్ బ్యూటి దీప్తి సునైనా. దీంతో ఆ నెటిజన్ కు కౌంటర్ ఇచ్చినట్లు అయింది. అయితే కొత్త ఇల్లు కొన్న దీప్తి సునయనా ఇటీవల కొత్త ఇంట్లోకి షిప్ట్ అయినట్లు చెప్పుకొచ్చింది. దీంతో కష్టపడి అనుకున్నది చేశావంటూ కొందరు ప్రశంసిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here