Siddharth : ఆ హీరోయిన్ తో ముంబయి వీధుల్లో సిద్ధార్థ్ చక్కర్లు.. దొరికేశాడుగా..!

- Advertisement -

లవర్ బాయ్ Siddharth​ హీరోయిన్​ అదితిరావు హైదరి రిలేషన్​షిప్​లో ఉన్నారని కొంతకాలం నుంచి ప్రచారం సాగుతోంది. దీనిపై వీరిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు. కానీ సిద్ధార్థ్​ మాత్రం ఇటీవలే అదితి పుట్టినరోజు సందర్భంగా ఓ ఫొటో ద్వారా ఈ విషయాన్ని పరోక్షంగా స్పందించాడు. ఇప్పుడీ జంట మరోసారి ముంబయిలోని ఓ హోటల్​లో కమెరా కంటికి చిక్కారు. దానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

Siddharth Aditi Rao Hydari
Siddharth Aditi Rao Hydari

సిల్వర్ స్క్రీన్ లవర్ బాయ్ సిద్ధార్థ్ రియల్ లైఫ్ లో కూడా అలాంటోడే. సిద్ధార్థ్ ని సౌత్ ఇండియా రణ్ బీర్ అనడంలో తప్పులేదు. కెరీర్ బిగినింగ్ నుంచి అధికారికంగానే అరడజను ఎఫైర్స్ నడిపాడు. బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు ప్రేమాయణాలు సాగించాడు. సోహా అలిఖాన్, శృతి హాసన్, సమంతలతో సిద్ధార్థ్ లవ్ ఎఫైర్స్ బాగా రచ్చకెక్కాయి. రంగ్ దే బసంతి మూవీ సమయంలో సైఫ్ అలీఖాన్ సోదరి సోహా అలీఖాన్ తో ప్రేమాయణం నడిపాడు సిద్ధార్థ్. అదే సమయంలో వేరే అమ్మాయితో ఎఫైర్ నడిపి చీటింగ్ చేయడంతో సోహా సిద్ధార్థ్ తో బ్రేకప్ చేసుకుంది. 

ఆ తర్వాత అనగనగా ఓ ధీరుడు మూవీలో శృతి హాసన్, సిద్ధార్థ్ జతకట్టారు. ఆ మూవీ సెట్స్ లో ఆమెను లైన్లో పెట్టాడు. కొన్నేళ్ల పాటు చక్కగా డేటింగ్ చేశారు. శృతి హాసన్ కూడా ఇలాంటి రిలేషన్స్ పెద్ద సీరియస్ గా తీసుకోదు. ఇద్దరికీ బోర్ కొట్టడంతో ఎలాంటి గొడవా లేకుండా విడిపోయారు.శృతికి బ్రేకప్ చెప్పాక సమంతకు దగ్గరయ్యారు. నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత-సిద్ధార్థ్ జబర్దస్త్ టైటిల్ తో మూవీ చేశారు. ఇది డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా సమంత, సిద్దార్థ్ రిలేషన్ కి బీజం వేసింది. సీరియస్ గా ప్రేమించే లక్షణం లేని సిద్దార్థ్ ఓ కన్నడ నటికి దగ్గరయ్యాడని సమంతకు తెలిసింది. సన్నిహితులు హెచ్చరించడంతో తెలివిగా రైట్ టైంలో అతడికి బ్రేకప్ చెప్పేసింది. 

- Advertisement -
Actor Siddharth Aditi Rao Hydari

సమంతతో విడిపోయి చాలా కాలం అవుతుండగా సిద్ధార్థ్ మరికొన్ని ఎఫైర్ నడిపాడని టాక్. ప్రస్తుతం ఈ హీరో రాజకుమారి అదితిరావ్ హైదరితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని ఇండస్ట్రీ టాక్. తాజాగా ఇద్దరూ ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ కెమెరాకు చిక్కడంతో ఔనూ వాళ్లిద్దరు ఇష్టపడుతున్నారని బీ టౌన్ కోడై కూస్తోంది. 

ఇక సిద్ధార్థ్, అదితిరావ్ హైదరిలకు ఇదివరకే వేర్వేరుగా పెళ్లిళ్లు జరిగి విడాకులు అయ్యాయి. సిద్దార్థ్ 2003లో మేఘన అనే అభిమానిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2007లో ఆమెకు విడాకులు ఇచ్చారు. అప్పటి నుండి మళ్లీ పెళ్లి మాట ఎత్తలేదు.


అదితి చాలా చిన్న వయసులో సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని రహస్య వివాహం చేసుకుంది. అనంతరం అతనితో విడిపోయింది. తెలుగులో అదితి చివరి చిత్రం మహాసముద్రం. ఈ మూవీలో సిద్ధార్థ్ సెకండ్ హీరో రోల్ చేశాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here