Shruti Haasan : పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న శృతి హాసన్.. క్లారిటీ ఇదే

- Advertisement -


Shruti Haasan : విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. తండ్రి నట వారసత్వాన్ని నిలబెడుతూ… మల్టీ టాలెంట్ తో సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ పాన్‌ వరల్డ్‌ హీరోయిన్ అయిపోయారు. వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడూ టచ్ లో ఉంటుంది శృతి హాసన్.

Shruti Haasan
Shruti Haasan

ఏ విషయాన్నైనా తాను ముక్కుసూటిగా మాట్లాడుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో, మక్కల్‌ ఇయక్కం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ వారసురాలు కావడంతో.. తరచూ ఆమెకు రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడంటూ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ విషయమై ఇప్పటికే శ్రుతిహాసన్‌ చాలా సార్లు స్పష్టంగా సమాధానం చెబుతూనే వస్తుంటుంది. రీసెంట్ గా కోయంబత్తూరులో మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ లో .. మరో సారి ఈ సందర్భంగా అదే ప్రశ్న ఎదురైంది. అయితే తనకు ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి లేదని పేర్కొన్నారు. తన దృష్టంతా సినిమాలపైనే ఉందన్నారు.

తాను ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సరసన.. మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్‌లో కనపించనున్నారు. అదేవిధంగా తొలిసారిగా ది ఐ అనే హాలీవుడ్‌ చిత్రంలోనూ నటిస్తోంది. సలార్ చిత్రం గురించి చెబుతూ ఇది అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది అన్నారు. తాను పెద్ద, చిన్న చిత్రాలు అని చూడనని.. ప్రేక్షకులకు మంచి కథా చిత్రాలను అందించడమే తనకు ముఖ్యమని పేర్కొన్నారు. స్వతహా తాను తమిళ అమ్మాయినని.. ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించేందుకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. త్వరలో ఓ ప్రైవేట్ ఆల్బమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here