Shruti Haasan : భయంకరమైన వ్యాధి బారినపడిన మరో స్టార్ హీరోయిన్..!



Shruti Haasan : చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు ఇప్పుడు చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండే సెలబ్రిటీలకు ఈ బాధలు తప్పవు. ఇంకా సినిమా సెలబ్రిటీల విషయంలో అయితే ఈ సమస్యలు ఎక్కువే. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు మానసిక రుగ్మతతో బాధపడుతున్నామని బాహాటంగానే చెప్పుకున్నారు. దీపికా పదుకొణె, సమంత వంటి హీరోయిన్లయితే కొన్నిసార్లు తమకు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయమేసేదని చెప్పారు. ఇప్పుడు తాజాగా మరో స్టార్ హీరోయిన్ ఈ సమస్యతో బాధపడుతోందట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే..?

Shruti Haasan
Shruti Haasan

విశ్వ నటుడు కమలహాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్ తన తండ్రి పరపతి ఏ మాత్రం వాడకుండా తన టాలెంట్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. మొదట్లో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ గబ్బర్ సింగ్ మూవీతో గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ బ్యూటీ హీరోయిన్  అంటే ఆ సినిమా పక్కాగా హిట్ అన్న టాక్ వచ్చేసింది. ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని అయితే శ్రుతి హాసన్ తన లక్కీ హీరోయిన్ అని చెప్పేశాడు కూడా. 

ఈ ఏడాది శ్రుతి హాసన్ లక్ మామూలుగా లేదు. సంక్రాంతి బరిలో ఈ బ్యూటీ రెండు సినిమాలున్నాయి. అవి కూడా టాలీవుడ్ అగ్రహీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలతో. ఈ రెండు సినిమాలకు సంబంధించి రిజల్ట్ కోసం ఆమె ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి రెండు సినిమాలలో ఈమె హీరోయిన్ కావడం విశేషం. ఈ రెండింటిలో ఏ ఒక్క సినిమా మంచి విజయం సాధించినా ఈమె కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్తుంది.

Actress Sruti Haasan
Actress Sruti Haasan

ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ గురించి ఓ క్రేజీ న్యూస్ తెలిసింది. ఈ భామ ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతోందట. శ్రుతి హాసన్ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ విషయాన్ని ఆమె స్వయంగా బయట పెట్టింది. “చిన్న చిన్న విషయాలకు కూడా సహనాన్ని కోల్పోయి.. విపరీతమైన కోపంతో రగిలిపోతాను.. ఈ విషయంలో నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించినా కూడా సాధ్యం కావడం లేదు . మొదట ఈ విషయాన్ని బయట చెప్పకూడదనుకున్నాను. ఎవరు ఏమనుకుంటారో అని భయపడ్డాను. దాన్ని కూడా నా యొక్క మానసిక రుగ్మతగానే అనిపించింది. అందుకే నేను ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెడుతున్నాను”. అంటూ తెలిపింది.

ప్రస్తుతం తాను మానసిక పరిస్థితికి చికిత్స తీసుకుంటున్నట్లుగా కూడా చెప్పుకొచ్చింది. కోపాన్ని తగ్గించుకోవడానికి పాటలు వింటున్నాను అని కూడా తెలిపింది. అనుకున్నది జరగకుండా అటు ఇటు అయితే మాత్రం షూటింగ్ సెట్ లో లేదా మరి ఎక్కడైనా సరే విపరీతమైన కోపం వస్తుందట. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసమే ఇలా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా శ్రుతి హాసన్ ఈ సమస్య నుంచి బయట పడాలని అభిమానులు కోరుకుంటున్నారు.