Shruthi Haasan : ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది శ్రుతి హాసన్ (Shruthi Haasan). వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో గోల్డెన్ లెగ్ అని బిరుదు తెచ్చుకుంది. ఆ రెండు సినిమాల్లో నటించినందుకు సుమారు మూడు కోట్ల రూపాయలు పారితోషికం అందుకున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఈ సినిమాల్లో నటించిన్నందుకు ఆమె ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది.

డబ్బు కోసం తన తండ్రి వయసు ఉన్న కథానాయకులతో శ్రుతి హాసన్ (Shruti Hassan) నటించిందని విమర్శించారు. కన్న కుమార్తె వయసున్న అమ్మాయితో రొమాన్స్ ఏంటని హీరోలను కూడా విమర్శించారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా దీనిపై శ్రుతి హాసన్ ఓతమిళ మీడియాతో మాట్లాడింది. ఒక సినిమాలో నటించడానికి హీరోయిన్స్ ఎంత కష్టపడతారో అని చెప్పింది.

తనకు మంచులో డాన్స్ చేయడం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పింది. అంతేకాకుండా హీరోలకు కోట్ల, షాల్స్ ఇస్తారని మాకు మాత్రం అలాంటివి ఏమీ ఇవ్వకుండానే జాకెట్టు, చీర ధరించి డాన్స్ చేయమంటే ఎలా అని ఆమె ఎదురు ప్రశ్నించింది. గతంలోనూ చిరంజీవి వాల్తేరు వీరయ్య లో శ్రీదేవి పాటకు డ్యాన్స్ చేయాలేకపోయానని ఆమె చెప్పింది. ఇప్పుడు మరోసారి కామెంట్స్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు.