Samyutha Menon : నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తున్న సంయుక్త మీనన్ వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే.ఈమె ఇప్పుడు ఒక సినిమా చేసింది అంటే అది కచ్చితంగా సూపర్ హిట్ సినిమా అని ఫిక్స్ అయిపోవచ్చు.ఈ కేరళ కుట్టి రేంజ్ అలా ఉంది మరి.

రీసెంట్ గా సార్ లాంటి గ్రాండ్ హిట్ తో మంచి ఊపు మీదున్న సంయుక్త మీనన్,ఇప్పుడు ‘విరూపాక్ష’ సినిమా ద్వారా రేపు మన ముందుకు రానుంది.ఇది ఇలా ఉండగా సంయుక్త మీనన్ ఏ హీరోయిన్ కూడా తీసుకొని రిస్క్, ఈ సినిమా కోసం తీసుకుంది.కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు బహుశా ఎవ్వరూ కూడా ఇలాంటి పని చేసి ఉండరు.అసలు విషయానికి వస్తే సంయుక్త మీనన్ ‘విరూపాక్ష’ చిత్రం లో హీరోయిన్ మాత్రమే కాదు, మెయిన్ విలన్ కూడా ఆమేనట.

మొన్ననే ఈ సినిమాకి సంబంధించి కొంతమంది అభిమానులు మరియు సినీ ప్రముఖుల సమక్షం లో ప్రైవేట్ స్క్రీనింగ్ వేసారట.ఆ షో నుండి లీక్ అయిన ముఖ్యమైన విషయం ఇది.ఒక గ్రామం లో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి.ఈ హత్యలన్నీ చేసేది ఎవరో కనుక్కోవడానికి హీరో ప్రయత్నం చేస్తూ ఉంటాడు, చివర్లో ఈ హత్యలన్నిటికి కారణం హీరోయిన్ అని తెలుస్తుంది.

ఇదే సినిమాలో అతిపెద్ద ట్విస్ట్ అట, ఈ ట్విస్ట్ తో పాటు హారర్ అనుభూతి థియేటర్స్ లో చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది అట, దానికి తగ్గట్టుగా మ్యూజిక్ కూడా కుదిరిందట. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడిప్పుడే టాప్ హీరోయిన్ రేస్ లోకి దూసుకెళ్తున్న సంయుక్త మీనన్ ఇలాంటి నెగటివ్ రోల్ చెయ్యడం వల్ల ఆమె కెరీర్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్న. రేపు ఆమెని క్యారక్టర్ ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.
