Shobha Shetty : బిగ్ బాస్ ట్రోఫీ పోతేపోనీ కానీ.. మెగా ఛాన్స్ కొట్టేసిన శోభా శెట్టి

- Advertisement -


Shobha Shetty : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 14వారాలు పూర్తి చేసుకుని ఫైనల్ వీక్ నడుస్తోంది. ఇటీవలే శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి తన ఇంటికి వెళ్ళింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని రోజులు అమ్మడు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అవసరం ఉన్నా లేకపోయినా నవ్వడం.. ఏడుపు రాకపోయినా ఏడవడం.. గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేకపోయినా గొడవలు పెట్టుకోవడం.. ఒకటా రెండా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. మహానటి అవార్డ్ బిగ్ బాస్ హౌస్ లో ఎవరికైనా ఇవ్వొచ్చు అంటే అది కచ్చితంగా శోభాశెట్టినే అని ఫిక్స్ అయిపోయారు జనాలు.

Shobha Shetty
Shobha Shetty

అలాంటి శోభాశెట్టి 14వ వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిందని, హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వారందరి కంటే శోభాశెట్టి అత్యధిక రెమ్యూనరేషన్‌ను తీసుకుని బయటకు వచ్చిందని అంటున్నారు. పెద్ద బంపర్ ఆఫర్ కొట్టేసావు అంటూ సపోర్టు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. డైరెక్టర్ వశిష్ట.. మెగాస్టార్ చిరంజీవి కాంబోలో రూపొందుతోన్న సినిమాలో ఓ చిన్న పాత్రకు శోభాశెట్టి ఫిక్స్ చేసుకున్నారట.

వశిష్ట తనలోని వైల్డ్ మాస్ విలనీని చూసి ఈ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ గా భావించి ఎంపిక చేసుకున్నాడట. ఇదే ఇప్పుడు వైరల్ అవుతుంది. వెధవ బిగ్ బాస్ ట్రోఫీని పోగొట్టుకుంటే పోగొట్టుకున్నావ్ కానీ, ఎన్ని జన్మలెత్తినా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ రాదని అంటున్నారు. మరికొందరు ఆమె హౌస్ నుంచి వెళ్లిపోవడమే బెటర్ అంటున్నారు..!!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here