Rashmika Mandanna : ఒక్క దెబ్బతో కుంభస్థలాన్ని కొట్టిన రష్మిక.. కుళ్లుకుంటున్న తమన్నా, రకుల్

- Advertisement -


Rashmika Mandanna.. ఇప్పుడు దేశంలో అన్ని ఇండస్ట్రీలలో ఈ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా ఇటీవల రష్మిక నటించిన యానిమల్ సినిమాకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో ఆమె పేరు హైలెట్ అయిపోయింది. నిజానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో అంత స్థానాన్ని దక్కించుకోవాలంటే మామూలు మాటలు కాదు. ఎన్నో ఏళ్ల కష్టపడితే కానీ రష్మిక వచ్చినంతటి గుర్తింపు రాదు. అందుకోసం ఎన్నో త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

కానీ బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిన అతి తక్కువ టైంలోనే హీరోయిన్ రష్మిక మందన్నా.. కుంభ స్థలాన్ని కొట్టి ఎవరికీ దక్కని క్రేజీ రికార్డులను నెలకొల్పింది. టాలీవుడ్ కు చెందిన మన హీరోయిన్స్ ఎంతోమంది బాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్నించిన సక్సెస్ కాలేకపోయారు. మరీ ముఖ్యంగా ఇలియానా, తాప్పీ, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా లాంటి వారు హీరోయిన్లుగా బాలీవుడ్ కు వెళ్లి అక్కడ బోల్తా పడ్డారు.

Rashmika Mandanna Photos

కానీ రష్మిక మందన్నా మాత్రం చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. దాంతో పాటు ఒక్క సినిమాతోనే బాలీవుడ్లో కనీ విని ఎరగని రికార్డ్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు యానిమల్ సినిమా ఇచ్చిన జోష్ తో బాలీవుడ్ లో ఏకంగా నాలుగు సినిమా ఛాన్సులు పట్టేసింది. వీటిల్లో ఏ ఒక్క సినిమా హిట్ అయిన రష్మిక భవిష్యతులో టాలీవుడ్ సైడ్ తిరిగి చూడదు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. చూడాలి మరి ఈ బ్యూటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ?

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here