Shivani Rajashekar : టాలీవుడ్ స్టార్ కపుల్ రాజశేఖర్, జీవిత దంపతులు కుమార్తె శివాని రాజశేఖర్ మెగా ఫ్యామిలీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. శివానీ నటించిన కోట బొమ్మాలి పీఎస్ మూవీ ప్రమోషన్స్ లో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. చిరంజీవితో గొడవలు నిజమేనని స్పష్టం చేసింది. రాజశేఖర్ కుటుంబానికి, మెగా ఫ్యామిలీకి చాలా కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. బహిరంగంగా చిరు, రాజశేఖర్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి. దీని గురించి మీడియా ప్రశ్నించినప్పుడు శివాని ఆసక్తికర సమాధానం ఇచ్చింది. .

నవ్వుతూ మాట్లాడుతూ.. లోపల బియ్యం గింజ అంత జరిగితే బయటకి బిర్యానీ అంత కనిపిస్తుంది. నిజమే కొన్ని వివాదాలు నడిచాయని క్లారిటీ ఇచ్చింది. పాలిటిక్స్ అన్నప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయని అంది. కానీ అవసరం అయినప్పుడు అంతా కలిసిపోతారు. మేం అంతా ఒకే ఇండస్ట్రీలో ఉన్నామని… ప్రొఫెషనల్ గా వేరు.. పర్సనల్ గా వేరుగా ఉంటుంది. మెగాస్టార్ ఫ్యామిలీకి తమ ఫ్యామిలీకి కొంత డిస్ట్రబెన్స్ వచ్చిందంది. కానీ ఆ వివాదాలు అన్ని ఆ హీట్ మూమెంట్ లో మాత్రమే జరిగాయంది. ఆ గొడవల గురించి బయట వాళ్లు ఎందుకు ఇంకా ఎక్కువగా గొడవ పడడం ? ట్రోలింగ్ ఎందుకు చేయడం ? అని ప్రశ్నించింది శివానీ.

గతంలో ఎప్పుడో చిన్న చిన్న వివాదాలు జరిగినంత మాత్రాన వాళ్ళ ప్రొడక్షన్ లో నేను నటించవద్దని రూల్ లేదు కదా అని ఘాటుగా స్పందించింది. మా ప్రొడక్షన్ లో వాళ్లు నటించవద్దని కూడా అనొద్దంది. మరోలైపు శివాని నటించిన కోట బొమ్మాళి పీఎస్ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే పర్సనల్ గా ఎలాంటి వివాదాలు జరిగినా తన ఫుల్ సపోర్ట్ ఫ్యామిలీకే ఉంటుంది అని శివాని తేల్చి చెప్పింది. కోట బొమ్మాళి పీఎస్ అనే చిత్రంలో ఈనెల 24న రిలీజ్ కానుంది. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.