Shah Rukh Khan : ప్రపంచంలోనే అరుదైన వస్తువును సొంతం చేసుకున్న షారూఖ్ ఖాన్.. లక్కంటే నీదే బాసూ !

- Advertisement -

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అంటే తెలియని వారుండరు. స్టార్ హీరోగా షారుక్ ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇటీవల పఠాన్, జవాన్ సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్నారు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల రికార్డులను సృష్టించారు. అయితే ప్రపంచంలో ఎవరి దగ్గర లేనిది కేవలం షారుఖ్ ఖాన్ దగ్గర మాత్రమే ఓ వస్తువు ఉందట. అదేంటో తెలుసుకుందాం. లిమోసిన్ కారు.. ప్రపంచంలోనే చాలా పొడవైన కారు.

Shah Rukh Khan
Shah Rukh Khan

ఇది ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలలో కనిపిస్తుంటుంది. మన ఇండియాలో దీనిని చూడడం చాలా అరుదు. ఈ కారుని ఎక్కువగా హాలీవుడ్లో బ్యాచిలర్ పార్టీలు లేదా విలాసవంతమైన జీవిన శైలిని చూపేందుకు మాత్రమే ఈ పొడవైన లిమోసిస్ కారును ఉపయోగిస్తుంటారు. అయితే ఈ కారులో కూర్చొని హాయిగా చిన్న పార్టీ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇండియన్ రోడ్లపై కూడా ఈ లిమోసిస్ కార్లు తిరగడానికి అనుమతి లేదు. అయితే ఇలాంటి కారు కేవలం ఒక్క హీరో వద్ద మాత్రమే ఉన్నది. అది మన షారూఖ్ ఖాన్.

నటనపరంగా, వ్యాపార పరంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు షారుఖ్. ఆయనకు VFX స్టూడియో కూడా ఉంది. అలాగే వివిధ ప్రాంతాలలో విలాసవంతమైన ఇళ్లను కూడా కలిగి ఉన్నారు. ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్న షారుఖ్ 2014లో లిమోసిస్ కారుని కొనుగోలు చేశారు. తన కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.

- Advertisement -

ఈ లిమోసిస్ కారుకు ప్రధాన మోడీకి చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందట. ఎందుకంటే 2018లో కామన్వెల్త్ సమ్మిట్ కు ప్రధాని హాజరు అయినప్పుడు ఆయన హోటల్ నుంచి ఈవెంట్ జరిగే ప్రాంతానికి ఈ లగ్జరీ కారులోనే వెళ్లారట. ఆ తర్వాత 2014లో షారుఖ్ ఖాన్ కుటుంబం దుబాయ్ రాజు కుటుంబాన్ని కలవడానికి ఈ కారును ఉపయోగించారట. నిజానికి చాలామంది స్టార్ హీరోస్ ఈ కార్లను కొనాలని చూస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మన దేశంలోని రోడ్లపై ఆ కార్లను తిప్పడానికి అనుమతించలేదట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here