Chiranjeevi : మెగాస్టార్ మువీకి సూపర్ స్టార్ ప్రొడ్యూసరా..? సినిమా పేరు ఇదేనా..!

- Advertisement -


Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ వీరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టాలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోలే. ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. చిరంజీవి కంటే ముందే కృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారన్న విషయం తెలిసిందే. అయితే చిరంజీవి నటించిన సినిమాకు కృష్ణ నిర్మాతగా వ్యవహరించాడనే విషయం చాలా మందికి తెలియదు. ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ సినిమాల రేంజ్ తో పాటు చిరంజీవి కెరీర్ నే మార్చేసింది. ఆ సినిమా మరేదో కాదు 1983లో విడుదలైన ఖైదీ. ఈ చిత్రాన్ని కోదండి రామిరెడ్డి తెరకెక్కించారు. చిరంజీవి హీరోగా నటించగా, మాధవి లత హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో చిరంజీవి జైలు నుంచి తప్పించుకుని స్మగ్లర్ల ముఠాతో పోరాడే ఖైదీగా కనిపించారు. ఈ సినిమాలో చిరంజీవి డాన్సులు, ఫైట్స్‌తో తన నట విశ్వరూపం చూపించాడు. అప్పట్లో చిరంజీవి కెరీర్లో ఇదో మైలు రాయి, కెరీర్‌లో తొలి కమర్షియల్‌ హిట్‌ కూడా ఇదే.

Chiranjeevi
Chiranjeevi

అయితే ఈ సినిమాను 1984లో హిందీలో రీమేక్‌ అయింది. హిందీ సినిమా నిర్మాత మరెవరో కాదు మనసూపర్ స్టార్ కృష్ణ. పద్మాలయా స్టూడియో బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. హిందీ వెర్షన్‌లో చిరంజీవి పాత్రను జితేంద్ర పోషించగా, మాధవి హీరోయిన్‌గా నటించింది. సుమలత పాత్రలో హేమమాలిని, రంగనాథ్ పాత్రలో శతృఘ్నసింత నటించారు. రావుగోపాలరావు పాత్రలో ఖాదిర్ ఖాన్ విలన్‌గా నటించారు. ఎస్ఎస్ రవిచంద్ర చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్కడ కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతగా ఓ రేంజ్ కి తీసుకెళ్లింది. అయితే కృష్ణా రెడ్డి నిర్మాతగా చిరంజీవి సినిమా చూశామని చాలా మంది అంటున్నారు. కానీ హిందీ సినిమా ఖైదీకి రీమేక్ అని చాలా మందికి ఇప్పటికీ తెలియదు. హిందీ కథ దాదాపు తెలుగు సినిమాకు కాపీ. డైలాగులు, పాటల్లో చిన్నపాటి మార్పులు మాత్రమే చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here