Big Boss : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ వారి కుటుంబ సభ్యుల దగ్గర నుండి లెటర్స్ వచ్చాయి. కానీ కంటెస్టెంట్స్ అంతా జంటలుగా విడిపోయారు కాబట్టి ఆ జంట నుండి ఒక్కరు మాత్రమే లెటర్‌ను చదవగలరు. ఇంకొక కంటెస్టెంట్.. లెటర్‌తో పాటు కెప్టెన్సీ రేసులో ఉండే అవకాశాన్ని కూడా త్యాగం చేయాలి. తమకు వచ్చిన లెటర్స్‌ను చూడడానికి శివాజీ, పల్లవి ప్రశాంత్.. ఇద్దరూ యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లారు. ఎంతసేపు చూసినా ప్రశాంత్.. ఏమీ మాట్లాడకపోయేసరికి శివాజీనే మళ్లీ డిస్కషన్ మొదలుపెట్టాడు.

‘‘నాకు ఒకటే ఫీలింగ్. ఓపెన్‌గా చెప్తున్నా. మనిద్దరమే ఆడతాం అనుకున్నా. అప్పుడు నీకు డైరెక్ట్‌గా కెప్టెన్సీ ఇచ్చేద్దాం అనుకున్నా. ఒక కామన్ మ్యాన్‌ను ఇక్కడ వరకు తీసుకొచ్చానంటే వాడు గెలవాలి. నీకు ఎప్పుడో చెప్పానుగా గుర్తుందా నువ్వు చాలా దూరం పోవాలి. చాలామందికి ఇన్‌స్పిరేషన్ అవుతావు నువ్వు. కంటెండర్ కంటే కాఫీ ఇచ్చాడు చాలు నాకు. నువ్వు కంటెండర్ అవ్వు. నా కొడుకు మీద పంతంతో వచ్చాను కానీ వెనక్కి వెళ్లడానికి రాలేదు నేను. నువ్వు ఊరి నుండి వచ్చాను అన్నావ్. వచ్చి హగ్ ఇచ్చావ్. ఆ తర్వాత నీతో ఎవరూ మాట్లాడట్లేదు దూరంగా ఉంటున్నారు అన్నావ్. బిడ్డ నేను ఉంటా అని చెప్పాను కదా. ఆడు. దున్ను. కానీ లైన్ దాటొద్దు. నేను వెనక్కి తగ్గుతున్నాను. నువ్వు గెలువాలి కాబట్టి నీ వెనకాల నిలబడతా అని చెప్తున్నా. ఆటలో ఒకడే గెలుస్తాడు.

ఇంట్లో పెళ్లాం, పిల్లలను అందరినీ వదిలేసి వచ్చాను. కాఫీని వదిలేసి వచ్చాను. ఇది నా రెండో పెళ్లాం. ప్రపంచంలో ఇంతకు మించిన యూనివర్సిటీ లేదు. మనిషిగా బ్రతకడానికి, నేర్చుకోవడానికి. వీళ్లను పొగడడం లేదు నేను. వీళ్లని పొగడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రపంచంలోనే ఇది బెస్ట్ షో. నీలాంటి వాళ్లని వందల మందిని తీసుకొస్తారు వీళ్ళు బయటికి. నువ్వు ఒకడివి గెలిచి చూపించరా’’ అంటూ పల్లవి ప్రశాంత్‌ను మోటివేట్ చేశాడు శివాజీ. ఆ తర్వాత తాను వయసులో పెద్దవాడిని అని, తన భార్య కూడా తనను అర్థం చేసుకుంటుందని చెప్తూ.. తనకు వచ్చిన లెటర్‌ను చింపేసి బయటికి వెళ్లిపోయాడు.