Bigg Boss లో నాకు ఓట్లు వెయ్యొద్దు అంటూ ఆడియన్స్ ని బ్రతిమిలాడుకుంటున్న శివాజీ!

- Advertisement -

Bigg Boss : నిన్న గాక మొన్న ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకొని 5 వ వారం లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. గత వారం లో రతికా రోజ్ ఎలిమినేట్ అయిపోయింది. ఈమె ఎలిమినేషన్ ఇంట్లో వాళ్లకి అలాగే ఆడియన్స్ కి పెద్ద షాక్. ఎందుకంటే బిగ్ బాస్ కి బోలెడంత కంటెంట్ ఇస్తుంది, దాంతో పాటుగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో కచ్చితంగా నిలుస్తుందని చాలా మంది నమ్మారు.

Bigg Boss
Bigg Boss

కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సంఘటన జరగడం నిజంగా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ సీజన్ లో ‘ఉల్టా పల్టా’ అనే బహుశా ఇలాగే ఉంటుందేమో. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు శివాజీ, ప్రియాంక, యావర్, అమర్ దీప్ , శుభ శ్రీ , గౌతమ్ కృష్ణ మరియు తేజ.

ఈ నామినేషన్స్ ప్రక్రియ మొత్తం వాడావేడి వాతావరణం లో సాగింది. ఇదంతా పక్కన పెడితే శివాజీ మొదటి నుండి ఏ చిన్న గొడవ జరిగినా, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను తలుపులు తియ్యండి బిగ్ బాస్ అని అంటూ ఉంటాడు. అలా ఇంతకు ముందు కూడా చాలా మంది కంటెస్టెంట్స్ అన్నారు కానీ, నిన్న ఎపిసోడ్ లో శివాజీ చేసిన పని మాత్రం బిగ్ బాస్ హిస్టరీ లో ఎవ్వరూ చెయ్యడం లేదు. కేవలం ఒక కాఫీ కోసం ఆయన ప్రేక్షకులు నాకు వోట్ వెయ్యకండి, నన్ను ఇంటి నుండి బయటకి పంపేయండి అని అడగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

- Advertisement -

శివాజీ కి కాఫీ లేకపోతే పిచ్చెక్కిపోతుంది అనే విషయం అందరికీ తెలిసిందే, హౌస్ మేట్స్ ఎవ్వరూ కూడా ఆయనకీ కాఫీ ఇవ్వలేదట. ఇదెక్కడి అన్యాయం , ఎవరిని ఎంటర్టైన్ చెయ్యడానికి నేను ఇక్కడ ఉండాలి, బిగ్ బాస్ కూడా నా పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నాడు అంటూ శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here