Shiva Rajkumar on RC16 : రామ్‍చరణ్‍తో సినిమా.. కన్నడ స్టార్ కామెంట్స్ వైర‌ల్

- Advertisement -

Shiva Rajkumar on RC16 : ఉప్పెన్ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనతో సినిమా (RC16) రూపొందిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఈరోజు జరిగాయి. దీంతో అధికారికంగా సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడాడు. ఈ సినిమా స్క్రిప్ట్‌ని బుచ్చిబాబు గంటన్నర పాటు చెప్పారని శివ రాజ్‌కుమార్ వెల్లడించారు. “రాంచరణ్ కొత్త సినిమా స్క్రిప్ట్‌తో బుచ్చిబాబు నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు నేను షాక్ అయ్యాను. అది వేరే స్థాయిలో ఉంది. అతను ఆ పాత్రను ఎలా ఊహించాడో నేను ఆశ్చర్యపోయాను” అని శివ రాజ్‌కుమార్ చెప్పారు.

శివ రాజ్‌కుమార్ కూడా రామ్ చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్ మంచి వ్యక్తి అని, అద్భుతమైన నటుడని అన్నారు. తాను కథ చెప్పడానికి వచ్చినప్పుడు బుచ్చిబాబు చేతులు ముడుచుకుని నిలబడ్డాడని, అయితే అలా చేయవద్దని దర్శకుడికి చెప్పానని అన్నారు. రామ్‌చరణ్-బుచ్చిబాబు కాంబో మూవీ ఆర్‌సి 16 పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కూడా వచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్‌ హాజరయ్యారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా పాల్గొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మించిన ఆర్‌సి 16. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్‌ని పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ రెజ్లర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ పొలిటికల్ యాక్షన్ మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే RC16 షూటింగ్ ప్రారంభం కానుంది. మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజు. దీనికి వారం రోజుల ముందు ఆర్‌సి 16 సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే గేమ్ ఛేంజర్ సినిమాలోని మొదటి పాటను మార్చి 27న విడుదల చేయనున్నారు.. సినిమా విడుదల తేదీపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here