Shekar Master : కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, కన్నడ, హిందీ హీరోలకు కొరియోగ్రఫీ చేస్తు భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతేకాకుండా పలు టీవీల్లో ప్రసారం అవుతున్న డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే అడపాదడపా స్కిట్లు కూడా చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన అమ్మాయిల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పెళ్లయి ఇద్దరు పిల్లలున్నప్పటికీ ఆయనకు క్రేజ్ ఎక్కువే. గతంలో శ్రీముఖితో కలిసి శేఖర్ మాస్టర్ ఓ షోలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో షోలో భాగంగా ఆమె ముద్దు కూడా పెట్టింది. అప్పట్లో అదో పెద్ద సెన్సేషన్ అయింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ గతంలో జరిగింది గుర్తు చేసుకుని వాస్తమెంటో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ‘‘ఢీ, జబర్దస్త్, కామెడీ స్టార్స్ వంటి షోలలో డాన్సులు చేస్తుంటే బాగా అరిచే వాళ్లు. అనసూయ, రష్మితో ఏదైనా మాట్లాడినా డ్యాన్స్ చేసినా అక్కడున్న వారు గోల పెట్టేవారు. ఏదో నాకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉందని పడి చస్తారనేలా క్రియేట్ చేశారు. కానీ అదంతా షోలో కమెడియన్స్ చేసే రూమర్ మాత్రమే అందులో ఎలాంటి నిజం లేదు. అలాగే శ్రీముఖి ఓ షోలో ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దు పెట్టినట్టు సరదాగా చేసింది. ఆమె చేసిన దానికి నేనేం చేస్తా.

ఆ షో తర్వాత జనాలు ఏదేదో ఉందంటూ అల్లేసి వార్తలు రాశారు. కానీ అది జస్ట్ నవ్వు తెప్పించేందుకు చేసింది మాత్రమే. అయితే కామెడీ స్టార్స్‌లో కూడా ఓసారి ఆ ముద్దు గురించి ప్రస్తావన వచ్చింది. నేను పట్టించుకోనట్టుగా ఉన్నాను. షూట్ అయ్యాక ఎందుకో తెలియదు కానీ నాకు ఇంటికి వెళ్లిన వెంటనే వైరల్ ఫీవర్ వచ్చింది. అసలు నాకు అమ్మాయిల ఫాలోయింగే లేదు. అయినా పెళ్లయిన వాడిని ఎవరు పట్టించుకుంటారండి. ప్రేక్షకులను అలరించడానికే అలా చేస్తాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కామెంట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.