Samantha : సమంత తప్ప నాకు మరో ఆప్షన్ లేదంటున్న నాగచైతన్య.. ఫుల్ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్

- Advertisement -


Samantha : టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత, అక్కినేని హీరో నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు తొలిసారి ‘ఏం మాయ చేశావే’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. దాదాపు ఐదారేళ్లు ప్రేమలో మునిగి తేలి.. తర్వాత కుటుంబీకుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అప్పుడే పెళ్లి తర్వాత సమంత పూర్తిగా సినిమాలకు దూరమవ్వనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

కానీ ఈ అమ్మడు అభిమానులకు ఊహించని రేంజ్ లో ‘ఊ అంటావా మావా..ఉ ఉ అంటావా మావ’ అనే ఐటెం సాంగ్‌కు స్టెప్పులేసి అక్కినేని ఫ్యామిలీలో అండ్ అక్కినేని అభిమానుల్లో కాస్త చెడ్డ పేరు తెచ్చుకుంది. ఈ కారణంగానే భర్త నాగ చైతన్యకు దూరమైందని టాక్ వినిపించింది. అయితే సామ్ – చైతూ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న క్రమంలో ప్రదీప్ యాంకర్ ‌గా నిర్వహించిన ఓ షోకు నాగచైతన్య గెస్ట్ గా హాజరయ్యాడు. ఇక షో లో నుంచి చైతూ.. సమంతకు కాల్ చేసి.. ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలు ఉండగా నేను సామ్ నే ఎందుకు ప్రేమించాను అని అడుగుతాడు.

దీనికి సమంత బదులిస్తూ నీకు ఇంకో ఆప్షన్ లేదని అంటుంది. అప్పుడు చైతన్య అవును నాకు నువ్వు తప్ప మరో ఆప్షన్ వద్దని చెబుతాడు. ప్రస్తుతం ఈ వీడియోను సమంత నాగ చైతన్య అభిమానులు సోషల్ మీడియాలో మరో సారి వైరల్ చేస్తున్నారు. మీరిద్దరు కలిస్తే చూడాలని ఉందని కోరుతున్నారు. చైతన్య నిజంగానే సమంతను తప్ప మరో అమ్మాయిని ఇప్పటివరకు ప్రేమించలేదు. చైతూ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండటానికి కూడా కారణం అదే. వారిద్దరూ మళ్లీ కలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here