Niharika Konidela :  షూటింగ్‌ కు ఆ యంగ్ హీరో రాలేదట‌.. అయ్యో నిహారిక‌

- Advertisement -

Niharika Konidela :  మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈమెకు కు మంచి ఫాలోయింగ్ ఉంది. కొత్త సవాళ్లను స్వీకరించడంలో నిహారిక ఎప్పుడూ ముందుంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే చాలా గ్యాప్ తర్వాత మళ్లీ హోస్ట్‌గా మారిన సంగతి తెలిసిందే. నిహారిక కొణిదెల చెఫ్ మంత్ర సీజన్ 3ని హోస్ట్ చేస్తోంది. అఫీషియల్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇప్పుడు ఈ షోలో నిహారికకు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. నిహారిక ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా. ఆమె ఆర్టిస్ట్‌గానే కాకుండా నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి హోస్ట్ గా తన టాలెంట్ చూపించేందుకు సిద్ధమైంది. దాని కోసం, ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ ఆహా విజయవంతంగా నడుస్తున్న చెఫ్ మంత్ర సీజన్ 3కి వేదిక కానుంది. ఈ షోకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. నిహారికను హోస్ట్‌గా ప్రకటిస్తూ పోస్టర్ కూడా విడుదల చేశారు.

Niharika Konidela

తాజాగా ఈ షూటింగ్ షెడ్యూల్ కూడా జరిగింది. ఇవాళ‌ (ఫిబ్రవరి 28) ఓ యువ టాలీవుడ్ హీరోతో షూటింగ్ కూడా జరగనుంది. షూట్ కోసం వెయిటింగ్ కోసం అంద‌రూ ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం అయిపోయింది. కొన్ని కారణాల వల్ల ఆయన రాకపోవడంతో షూట్ కూడా క్యాన్సిల్ అయిందనే టాక్ వినిపిస్తోంది. చెఫ్ మంత్ర సీజన్ 3ని మార్చి 3న గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు షూటింగ్ క్యాన్సిల్ కావడంతో డేట్ కూడా మారుతుందా? లేదా అదే తేదీన మొదటి ఎపిసోడ్‌ని ప్రసారం చేయాలా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీజన్ 3.. మార్చి 3న స్టార్ట్ చేద్దాం అనుకున్నారేమో.. ఏది ఏమైనా మార్చి 3న సీజన్ 3 స్టార్ట్ అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరి నిహారిక యాంకరింగ్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఇప్పటికే ఢీ జూనియర్స్ షోకి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. నిహారిక కొణిదెల బెస్ట్ ఫిమేల్ యాంకర్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత నిహారిక మరోసారి హోస్ట్‌గా మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతోంది. మంచు లక్ష్మి గత సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే ఈ సీజన్‌కు నిహారిక ఎంపికైంది. ఇప్పుడు అన్నీ బాగున్నాయ‌ని త‌రుణంలో హీరో షూటింగ్ హ్యాండ్ ఇవ్వ‌డంతో అయ్యో నిహారిక ఎంత‌ప‌నైంది. ఆదిలోనూ అంత‌మైంద‌ని తెలుస్తుంది నీ షూటింగ్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్లు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here