రాకేష్ మాస్టర్ సోషల్ మీడియా లో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ లో ఒకడు రాకేష్ మాస్టర్.ఈయన మాట్లాడే మాటలు సోషల్ మీడియా లో ఎలా ట్రెండ్ అవుతూ ఉంటాయో మన అందరికి తెలిసిందే. కొన్ని కొన్ని ఆయన ఎమోషనల్ గా మాట్లాడిన అవతలి వ్యక్తి కి కామెడీ గా అనిపిస్తుంది. ఈయన వీడియోస్ లోని కొన్ని షాట్స్ తీసుకొని మీమెర్స్ సోషల్ మీడియా లో సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తూ ఉంటారు.
ఒకప్పుడు ఈయన పెద్ద కొరియోగ్రాఫర్, ఆ తర్వాత కొత్త కొరియోగ్రాఫర్స్ రాకతో ఈయన డిమాండ్ బాగా తగ్గిపోయింది.ప్రస్తుతం ఇండియా లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న కొరియోగ్రాఫర్స్ లో ఒకరైన శేఖర్ మాస్టర్, ఈయన శిష్యరికం నుండి వచ్చిన వ్యక్తే. శేఖర్ మాస్టర్ పైకి ఎదుగుతున్న సమయం లో అతనిపై రాకేష్ మాస్టర్ సంచలన ఆరోపణలు ఎన్నో చేసాడు.
ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో పెద్ద దుమారం రేపింది, దీనిపై శేఖర్ మాస్టర్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘ రాకేష్ మాస్టర్ నా గురువు గారు,ఆయనంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది, ఆయన ఎక్కడ ఉన్నా బాగుండాలనే నేను కోరుకుంటాను. అయితే ఎప్పుడూ నాతో బూతులు మాట్లాడని రాకేష్ మాస్టర్ ఒకరోజు నన్ను ఇంటికి పిలిచి ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టాడు.
నన్ను ఎన్ని అన్నా నేను భరిస్తాను కానీ, మా అమ్మదాకా వచ్చేసరికి ఎందుకు గమ్ముగా ఉంటాను, అమ్మకంటే ఎక్కువ ఎవ్వరూ కాదు కదా, ఇక మీతో జీవితం లో మాట్లాడను మాస్టర్ అని వచ్చేసాను.ఒక రోజు రాత్రి తాగేసి నా భార్య కి ఫోన్ చేసాడు, నా కూతురు పుట్టినరోజు కి చేసిన ఫంక్షన్ గురించి ఆయనకీ చెప్పలేదట, అంత పెద్దవాళ్ళు అయిపోయారా అంటూ నా భార్య తో కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడాడట. అందుకే ఆయనని సంపూర్ణంగా దూరం పెట్టేసాను, ఆయన గురించి ఇంకా మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు, ఆయన ఎక్కడ ఉన్న బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నాను’ అంటూ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.